‘ఏపీలో కరోనా ఆందోళన కలిగిస్తోంది’

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని బీజేపీ, జనసేన పార్టీ కీలక నేతల సమావేశం అభిప్రాయపడింది. పరీక్షల సంఖ్య పెరిగినప్పటికీ వేగంగా వైరస్ విస్తరిస్తుందని.. నివారించడంతో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడం లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సతీష్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధి నివారణలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న, డాక్టర్లు, వైద్య సిబ్బంది రక్షణలో సర్కారు వైఫల్యం కనిపిస్తోందని ఇరు పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు. ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జనసేన […]

Update: 2020-07-12 10:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని బీజేపీ, జనసేన పార్టీ కీలక నేతల సమావేశం అభిప్రాయపడింది. పరీక్షల సంఖ్య పెరిగినప్పటికీ వేగంగా వైరస్ విస్తరిస్తుందని.. నివారించడంతో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడం లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సతీష్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధి నివారణలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న, డాక్టర్లు, వైద్య సిబ్బంది రక్షణలో సర్కారు వైఫల్యం కనిపిస్తోందని ఇరు పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు. ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదేండ్ల మనోహర్, బీజేపీ నేతలు సతీష్ జీ, ఎంపీ జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా నివారణలో ఎక్కడ లోటు పాట్లు ఉంటే అక్కడ ప్రజా పక్షాన నిలబడి ఇరుపక్షాలు పోరాటం చేస్తామన్నారు.

Tags:    

Similar News