‘ఎన్టీఆర్‌ను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు’
దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్‌ను నమ్మించి మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజలను టీడీపీ మోసం చేసిందన్న సోము వీర్రాజు.. వైసీపీ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అసమర్థతను ఎండగడుతాం అని ఆయన హెచ్చరించారు. వైసీపీ నేతలు రూ. వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. ఇక అచ్చెన్నాయుడి వ్యవహారం పై స్పందించిన సోము వీర్రాజు.. అచ్చెన్నాయుడు టీడీపీ అధ్యక్షుడా? […]
దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్‌ను నమ్మించి మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజలను టీడీపీ మోసం చేసిందన్న సోము వీర్రాజు.. వైసీపీ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అసమర్థతను ఎండగడుతాం అని ఆయన హెచ్చరించారు. వైసీపీ నేతలు రూ. వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. ఇక అచ్చెన్నాయుడి వ్యవహారం పై స్పందించిన సోము వీర్రాజు.. అచ్చెన్నాయుడు టీడీపీ అధ్యక్షుడా? చంద్రబాబు కుటుంబానికి అధ్యక్షుడా? అంటూ ప్రశ్నించారు. గతంలో మంత్రిగా ఉన్న అచ్చెన్నా ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు.