ఉద్యమకారుడికి ప్రగతి భవన్ వద్ద చేదు అనుభవం
దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యమం సమయంలో ఉత్సాహంగా పాల్గొన్న స్వర్ణకారుడు శ్రీరామోజు ఆంజనేయులు ఏడేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడానికి చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. చివరకు స్వస్థలమైన ఆదిలాబాద్ పట్టణం నుంచి 17 రోజుల పాటు పాదయాత్ర చేసి శనివారం ప్రగతి భవన్ కు చేరుకున్నా కలవడానికి అపాయింట్‌మెంట్ దొరకలేదు. రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఒకటి రెండు సందర్భాల్లో ఉద్యమకారుడిగా కేసీఆర్‌ను కలుసుకున్నానని, కానీ ముఖ్యమంత్రిగా ఆయనను ఏడేళ్ళుగా కలవడానికి అవకాశం చిక్కడం లేదని ఆవేదన వ్యక్తం […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యమం సమయంలో ఉత్సాహంగా పాల్గొన్న స్వర్ణకారుడు శ్రీరామోజు ఆంజనేయులు ఏడేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడానికి చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. చివరకు స్వస్థలమైన ఆదిలాబాద్ పట్టణం నుంచి 17 రోజుల పాటు పాదయాత్ర చేసి శనివారం ప్రగతి భవన్ కు చేరుకున్నా కలవడానికి అపాయింట్‌మెంట్ దొరకలేదు. రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఒకటి రెండు సందర్భాల్లో ఉద్యమకారుడిగా కేసీఆర్‌ను కలుసుకున్నానని, కానీ ముఖ్యమంత్రిగా ఆయనను ఏడేళ్ళుగా కలవడానికి అవకాశం చిక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒంటరిగా పాదయాత్ర చేసి శనివారం ఉదయం ప్రగతి భవన్ చేరుకున్న ఆయనకు పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక ఎమ్మెల్యే నుంచి లిఖితపూర్వకంగా ఏదైనా లెటర్ తెచ్చుకున్నావా అంటూ ప్రశ్నించిన పోలీసులు అది లేకుండా సీం అపాయింట్‌మెంట్ గురించి పరిశీలించే అవకాశమే లేదని తనను పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారని ఆంజనేయులు తన ఆవేదనను వ్యక్తం చేశారు. దేవుడ్ని కలిసినప్పుడు ఏం వరం కోరుకుంటామో ఇప్పుడు ఉద్యమకారుడైన కేసీఆర్‌ను కూడా కనీసం ఒక్కసారైనా కలవాలనుకున్నానని తెలిపారు. చివరి అవకాశం కూడా సాకారం కాలేదన్న బాధతో ఆర్టీసీ బస్సులో ఆదిలాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు