తాలిబన్లపై బిపిన్ రావత్ స్పందన

దిశ వెబ్‌డెస్క్: తాలిబన్లు ఆప్ఘాన్‌ను స్వాధీనం చేసుకోవటం పై భారత ఆర్మీ అధికారికంగా స్పందించింది. ‘మేము ముందు అనుకున్నట్లుగానే జరిగింది. కానీ ఇంత తొందరగా అని మాత్రం అనుకోలేదు, దానికి కొన్ని నెలల సమయం పడుతుందని అంచనా వేశాం’ అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్( సీడీఎస్) బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. భారతదేశం తరపు నుంచి ప్రస్తుత పరిణామాలను ఆలోచిస్తే ఇదీ కొంచెం కఠినమైన సవాలే. కానీ ఆర్మీకి ఇవన్నీ కొత్త కాదు. దేనినైన ఎదుర్కోవడానికి మేము […]

Update: 2021-08-25 05:02 GMT

దిశ వెబ్‌డెస్క్: తాలిబన్లు ఆప్ఘాన్‌ను స్వాధీనం చేసుకోవటం పై భారత ఆర్మీ అధికారికంగా స్పందించింది. ‘మేము ముందు అనుకున్నట్లుగానే జరిగింది. కానీ ఇంత తొందరగా అని మాత్రం అనుకోలేదు, దానికి కొన్ని నెలల సమయం పడుతుందని అంచనా వేశాం’ అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్( సీడీఎస్) బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. భారతదేశం తరపు నుంచి ప్రస్తుత పరిణామాలను ఆలోచిస్తే ఇదీ కొంచెం కఠినమైన సవాలే. కానీ ఆర్మీకి ఇవన్నీ కొత్త కాదు. దేనినైన ఎదుర్కోవడానికి మేము సదా సిద్దంగా ఉన్నామని సీడీఎస్ అన్నారు.

20 ఏళ్ల కింద కాబూల్‌లో ఏం ఉందో, ఇప్పుడు కూడా అదే ఉంది కదా అని చెప్పారు. అయితే సమస్యల్లా పాకిస్తాన్‌తోనే అని అభిప్రాయపడ్డారు. దేశంలోని విధ్వంసం సృష్టించడానికి పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాదులు కాబూల్‌ను కేంద్రంగా చేసుకోవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే భారత నిఘా వర్గాలు లష్కర్-ఏ- తోయిబా, జైష్-ఏ-మహ్మద్ లాంటి సంస్థలు కాబూల్‌లో రహస్యంగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయని చెప్పారు.

భారత్ ఇదే విషయాన్ని క్వాడ్, బ్రిక్స్ సమావేశాల్లో లేవనెత్తుతుందని చెప్పారు. వీరి నుంచి సహయం వస్తే తీసుకుంటామని తెలిపారు. ఇండో ఫసిఫిక్, ఆప్ఘాన్ సమస్యలు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయని అంచనా వేశారు. ఆప్ఘాన్ పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత్ పూర్తి స్థాయిలో అప్రమత్తమయింది. భారత ప్రజలతో మైనారిటీ సిక్కులు, హిందువులు, ఇతర ఆప్ఘాన్‌లను తీసుకురావడానికి గేట్లు ఓపెన్ చేసింది. దానిలో భాగంగానే వందలాది మందిని న్యూఢిల్లీకి తరలించింది.

Tags:    

Similar News