విమానయాన రంగంలో పెట్టుబడులకు సిద్ధమైన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టాక్ మార్కెట్లో రారాజు, ఇండియన్ వారెన్ బఫెట్‌గా పేరున్న పెట్టుబడిదారులు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇప్పటికే అనేక రంగాల్లో ఇన్వెస్ట్ చేశారు. తాజాగా ప్రత్యక్ష మార్కెట్లో రానున్నట్టు, మొదటగా విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు. దశాబ్దాలుగా షేర్ మార్కెట్‌కే పరిమితమైన ఆయన ఇప్పుడు బహిరంగా మార్కెట్లోకి రానుండటంతో మార్కెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. రాబోయే నాలుగేళ్లలో 70 వరకు విమానాలాతో కొత్త ఎయిర్‌లైన్స్ ప్రారంభించేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీనిద్వారా […]

Update: 2021-07-28 08:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టాక్ మార్కెట్లో రారాజు, ఇండియన్ వారెన్ బఫెట్‌గా పేరున్న పెట్టుబడిదారులు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇప్పటికే అనేక రంగాల్లో ఇన్వెస్ట్ చేశారు. తాజాగా ప్రత్యక్ష మార్కెట్లో రానున్నట్టు, మొదటగా విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు. దశాబ్దాలుగా షేర్ మార్కెట్‌కే పరిమితమైన ఆయన ఇప్పుడు బహిరంగా మార్కెట్లోకి రానుండటంతో మార్కెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. రాబోయే నాలుగేళ్లలో 70 వరకు విమానాలాతో కొత్త ఎయిర్‌లైన్స్ ప్రారంభించేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

దీనిద్వారా విమాన ప్రయాన్ని ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. 2020లో కరోనా మహమ్మారి కారణంగా దేశీయ విమానయాన రంగం భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా తీవ్ర సంక్షోభంలో ఉన్న ఈ రంగంలో 35 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 260.37 కోట్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్టు చెప్పారు. ఈ కొత్త విమానయాన సంస్థ కోసం ఆయన మరో పదిహేను రోజుల్లో విమానయాన శాఖ నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ను కూడా అందుకోనున్నట్టు సమాచారం.

Tags:    

Similar News