#ArrestBillGates.. గిరిజన బాలికల జీవితాలను నాశనం చేసిన బిల్‌గేట్స్..?
దిశ, వెబ్‌డెస్క్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైంది. 2009లో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ (బిఎమ్‌జిఎఫ్) ద్వారా గిరిజన పిల్లలపై అనధికార స్వదేశీ వ్యాక్సిన్‌లను పరీక్షించే కార్యక్రమం కోసం నిధులు సమకూర్చారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ టీకాలు తీసుకున్న పిల్లలు చాలా మంది అనారోగ్యానికి గురయ్యారని.. అందులో ఏడుగురు మరణించారు.. దీనికి కారణమైన బిల్ గేట్స్‌ను అరెస్ట్ […]
దిశ, వెబ్‌డెస్క్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైంది. 2009లో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ (బిఎమ్‌జిఎఫ్) ద్వారా గిరిజన పిల్లలపై అనధికార స్వదేశీ వ్యాక్సిన్‌లను పరీక్షించే కార్యక్రమం కోసం నిధులు సమకూర్చారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ టీకాలు తీసుకున్న పిల్లలు చాలా మంది అనారోగ్యానికి గురయ్యారని.. అందులో ఏడుగురు మరణించారు.. దీనికి కారణమైన బిల్ గేట్స్‌ను అరెస్ట్ చేయాలంటున్నారు. ముఖ్యంగా ఇండియాలోని గిరిజన బాలికలపైనే అనధికారికంగా వ్యాక్సిన్ ట్రయల్స్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇంత ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఇంత పెద్ద తప్పు ఎలా చేయగలిగాడు అంటూ నెటిజన్ల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తోంది. ట్విట్టర్ వేదికగా ట్రైబల్ ఆర్మీ, గ్రేట్‌గేమ్‌ఇండియా, పలు మీడియా సంస్థలు #ArrestBillGates హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేయగా.. ఇదే విషయంపై మరో 23.2k మంది నెటిజన్లు ట్వీట్ చేయడం విశేషం.
This is the untold story of how @BillGates funded NGO PATH killed tribal girls in India in unauthorised clinical trials and got away with it. #ArrestBillGates https://t.co/yYqCRZ4Ah3
— Tribal Army (@TribalArmy) May 29, 2021
India Demand.#ArrestBillGates@JoeBiden @FBI https://t.co/kr6wbs8r2X
— Hansraj Meena (@HansrajMeena) May 29, 2021