Errolla Srinivas : ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు

ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్(Errolla Srinivas) కు నాంపల్లి(Nampally) 3వ అడిషనల్ మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది.

Update: 2024-12-26 11:11 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్(Errolla Srinivas) కు నాంపల్లి(Nampally) 3వ అడిషనల్ మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌(Banjarahills PS)లో పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Koshik Reddy) తో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నోటీసు అందించడానికి పోలీసులు గురువారం ఉదయం శ్రీనివాస్‌ ఇంటికి చేరుకున్నారు. అయితే అరెస్ట్ చేస్తారనే సమాచారంతో శ్రీనివాస్ తన ఇంట్లో నుంచి బయటకు రాలేదు. దీంతో న్యాయవాదులతో కలిసి పోలీసులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్ళారు. అనంతరం ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి, నాంపల్లి కోర్టులో హాజరు పరచగా.. ఇరువైపులా వాదనలు విన్న కోర్ట్.. కండిషన్స్ బెయిల్ మంజూరు చేసింది. రూ.5 వేల పూచీకత్తుతోపాటు, ఇద్దరి ష్యూరిటీతో కూడిన బెయిల్ ఇచ్చింది. అలాగే పోలీసుల విచారణకు సహకరించాలని శ్రీనివాస్ కు సూచించింది. 

Tags:    

Similar News