చెట్లకు రాఖీ కట్టమంటున్న సీఎం.. ఎందుకంటే ?

పాట్నా: బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం చెట్లకు రాఖీ కట్టారు. పర్యావరణం పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి 2012 నుంచి రాఖీ పండగను వృక్షా రాఖీ పండగగా అక్కడి ప్రభుత్వం జరుపుతోంది. అందులో భాగంగా ఈ రోజు మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలను చూసుకోవాలని పిలుపునివ్వటం ఆనవాయితీగా జరుగుతోంది. అందులో భాగంగానే నేడు ముఖ్యమంత్రి చెట్లకు రాఖీ కట్టారు. ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. చెట్లను కాపాడితే ప్రజలను కాపాడినట్లే అని […]

Update: 2021-08-22 08:47 GMT

పాట్నా: బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం చెట్లకు రాఖీ కట్టారు. పర్యావరణం పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి 2012 నుంచి రాఖీ పండగను వృక్షా రాఖీ పండగగా అక్కడి ప్రభుత్వం జరుపుతోంది. అందులో భాగంగా ఈ రోజు మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలను చూసుకోవాలని పిలుపునివ్వటం ఆనవాయితీగా జరుగుతోంది. అందులో భాగంగానే నేడు ముఖ్యమంత్రి చెట్లకు రాఖీ కట్టారు. ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. చెట్లను కాపాడితే ప్రజలను కాపాడినట్లే అని సీఎం అన్నారు. మా ప్రభుత్వం జల్ జీవన్ యారీయాలీ మిషన్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి మొక్కలను నాటుతుందన్నారు. భవిష్యత్ తరాలకు పర్యావరణంపై అవగాహన కల్పించాలని కోరారు.

 

 

Tags:    

Similar News