ఇక నేరుగా ఏపీకే
దిశ ఏపీ బ్యూరో: కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వస్తున్న ఏపీ వాసులకు ఊరట కలగనుంది. ఇప్పటి వరకు అలా వచ్చిన వారిని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా 14 రోజుల పెయిడ్ క్వారంటైన్‌కు తలిరించేవారన్న సంగతి తెలిసిందే. ఇకపై అలా క్వారంటైన్‌కు కాకుండా సొంత రాష్ట్రానికి తరలించనున్నారు. ఏపీకి చెందిన వారు విదేశాల నుంచి వస్తే హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగాల్సి ఉండేది. కరోనా వైరస్ భయం నేపథ్యంలో వారందర్నీఅక్కడ ఏర్పాటు చేసిన […]
దిశ ఏపీ బ్యూరో: కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వస్తున్న ఏపీ వాసులకు ఊరట కలగనుంది. ఇప్పటి వరకు అలా వచ్చిన వారిని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా 14 రోజుల పెయిడ్ క్వారంటైన్‌కు తలిరించేవారన్న సంగతి తెలిసిందే. ఇకపై అలా క్వారంటైన్‌కు కాకుండా సొంత రాష్ట్రానికి తరలించనున్నారు.
ఏపీకి చెందిన వారు విదేశాల నుంచి వస్తే హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగాల్సి ఉండేది. కరోనా వైరస్ భయం నేపథ్యంలో వారందర్నీఅక్కడ ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించేవారు. ఇందుకోసం ఎయిర్ పోర్టు పరిసరాల్లోని 2,3,4 స్టార్ హోటళ్ల గదులను తెలంగాణ ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. 14 రోజులకు ప్రయాణికులు కోరుకునే వసతులను అనుసరించి 15,000 నుంచి 30,000 రూపాయల రుసుం వసూలు చేసేది.
దీంతో విదేశాల నుంచి ఎంతో ఆశగా స్వదేశం చేరినా.. కుటుంబ సభ్యులను కలిసే వెసులుబాటుతో పాటు, సొంత ఊర్లో ఉన్నామన్న భావన కూడా ఉండేదికాదు. దీంతో అనవసరంగా స్వదేశం వచ్చామా? అన్న ఆందోళన వారిలో నెలకొని ఉండేది. వీటన్నింటిని అర్థం చేసుకున్న రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చించి, ఇకపై ఏపీకి చెందిన వారిని పరీక్షల అనంతరం నేరుగా ఏపీకి తరలించనున్నారు. ఈ మేరకు తొలి విడత 121 మంది ప్రయాణికుల్లో 33 మంది ఆంధ్రులను ప్రత్యేక వాహనాల్లో తరలించినట్టు అధికారులు చెబుతున్నారు.