కోయిల్ సాగర్‌లో బిగ్ ఫిష్ ?
దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని కోయిల్ సాగర్‌లో పెద్ద చేప ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. మంగళవారం ఒక్కసారిగా ఆ చేప నీటి పైకి రావడంతో అక్కడే ఉన్న యువకులు దాని వీడియో తీసి సోషల్ మీడియా పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది. కోయిల్ సాగర్‌లో గతంలోనూ ఇంతపెద్ద చేపను ఎప్పుడు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. దీని ఆకారం కొంచం అటుఇటుగా సోరచేప అంతగా ఉందని చెప్పుకుంటున్నారు. […]
దిశప్రతినిధి, మహబూబ్ నగర్ :
మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని కోయిల్ సాగర్‌లో పెద్ద చేప ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. మంగళవారం ఒక్కసారిగా ఆ చేప నీటి పైకి రావడంతో అక్కడే ఉన్న యువకులు దాని వీడియో తీసి సోషల్ మీడియా పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది. కోయిల్ సాగర్‌లో గతంలోనూ ఇంతపెద్ద చేపను ఎప్పుడు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. దీని ఆకారం కొంచం అటుఇటుగా సోరచేప అంతగా ఉందని చెప్పుకుంటున్నారు. ఈ చేప అసలు ఈ చెరువులోకి ఎక్కడి నుంచి వచిందనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఇటీవల కాగ్నానది తెగిన సమయంలో అక్కడి నీరు కోయిల్ సాగర్‌కు చేరింది. ఆ నీటి ప్రవాహంలో ఈ చేప కొట్టుకుని రావొచ్చనే పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్థులు చెరువు వద్దకు చేరుకుని చేపను చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.