భువీని తీసుకెళ్లకపోవడమే పెద్ద తప్పు

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి పాలయ్యాక మాజీ క్రికెటర్లు పలు కారణాలు చెబుతున్నారు. స్వింగ్ అయ్యే ఇంగ్లాండ్ పిచ్‌లపై భారత పేసర్లు సరిగా బౌలింగ్ చేయలేకపోయారని ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. తాజాగా మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ మరో విషయం చెప్పారు. భువనేశ్వర్ కుమార్ వంటి స్వింగ్ బౌలర్‌ను ఇంగ్లాండ్ పర్యటనకు తీసుకెళ్లక పోవడం పెద్ద తప్పిదమని అన్నాడు. ‘భారత జట్టులో ఉత్తమ స్వింగర్ భువీ మాత్రమే. అతడిని గాయం పేరుతో […]

Update: 2021-06-27 11:52 GMT

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి పాలయ్యాక మాజీ క్రికెటర్లు పలు కారణాలు చెబుతున్నారు. స్వింగ్ అయ్యే ఇంగ్లాండ్ పిచ్‌లపై భారత పేసర్లు సరిగా బౌలింగ్ చేయలేకపోయారని ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. తాజాగా మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ మరో విషయం చెప్పారు. భువనేశ్వర్ కుమార్ వంటి స్వింగ్ బౌలర్‌ను ఇంగ్లాండ్ పర్యటనకు తీసుకెళ్లక పోవడం పెద్ద తప్పిదమని అన్నాడు. ‘భారత జట్టులో ఉత్తమ స్వింగర్ భువీ మాత్రమే. అతడిని గాయం పేరుతో పక్కన పెట్టడం చాలా పెద్ద తప్పు. గాయాల బారిన పడిన ఇతరులను రిజర్వ్‌లో పెట్టిన సెలెక్టర్లు భువీని పూర్తిగా దూరం పెట్టడం పెద్ద తప్పిదం. మరోవైపు ఆల్‌రౌండర్ల కొరత స్పష్టంగా కనిపించింది. అన్ని సార్లు హార్దిక్ పాండ్యాపై ఆధారపడాల్సిన అవసరం లేదు. శార్దుల్ ఠాకూర్ కూడా మంచి ఆల్ రౌండరే. అతడిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది’ అని శరణ్ దీప్ సింగ్ అన్నారు.

Tags:    

Similar News