నిన్ను చూసి ఓట్లు వేయలేదు.. కౌశిక్ రెడ్డిపై భట్టి ఫైర్

దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇన్ చార్జి, జనరల్ సెక్రటరీ మాణిక్యం ఠాగూర్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ వాదులెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, విధానాలను, అమలు చేయడం కోసం అందరూ ముందుండి నడిపించాలన్నారు. సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, పార్టీ నాయకులు […]

Update: 2021-07-13 10:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇన్ చార్జి, జనరల్ సెక్రటరీ మాణిక్యం ఠాగూర్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ వాదులెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, విధానాలను, అమలు చేయడం కోసం అందరూ ముందుండి నడిపించాలన్నారు.

సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ తప్పనిసరిగా ఆమోదించి అమలు పరచాల్సిందే అన్నారు. మాణిక్యం ఠాగూర్‌పై డబ్బులు అభియోగం మోపడం సమంజసం కాదన్నారు. అభాండాలు మొత్తం పార్టీకి నష్టం కలిగిస్తాయన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డికి వచ్చిన 61,121 ఓట్లన్నీ కాంగ్రెస్ ఓట్లన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. హుజురాబాద్‌కు జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఓట్లు చీలినా.. స్థిరమైన ఓటు బ్యాంక్‌తో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

Tags:    

Similar News