భారతీ ఇన్‌ఫ్రాటెల్ సీఎఫ్‌వోగా పూజా జైన్!
దిశ, సెంట్రల్ డెస్క్: టెలికాం మౌలిక సదుపాయాల సంస్థ భారతీ ఇన్‌ఫ్రాటెల్ పూజా జైన్‌ను చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌వో)గా నియమించింది. ఆమె రేపటి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇదివరకు ఎస్ బాలసుబ్రహ్మణియన్ ఈ బాధ్యతల్లో విధులు నిర్వహించారు. హెచ్ఆర్ నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ, ఆడిట్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ కమిటీ, సంస్థ డైరెక్టర్ల బోర్డు బుధవారం సమావేశంలో పూజా జైన్‌ను చీఫ్‌గా నియమించినట్టు భారతీ ఇన్‌ఫ్రాటెల్ ప్రకటించింది. పూజా జైన్ చార్టర్డ్ అకౌంటెంట్ చేశారు. ఇందులో 17 సంవత్సరాల […]
దిశ, సెంట్రల్ డెస్క్: టెలికాం మౌలిక సదుపాయాల సంస్థ భారతీ ఇన్‌ఫ్రాటెల్ పూజా జైన్‌ను చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌వో)గా నియమించింది. ఆమె రేపటి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇదివరకు ఎస్ బాలసుబ్రహ్మణియన్ ఈ బాధ్యతల్లో విధులు నిర్వహించారు. హెచ్ఆర్ నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ, ఆడిట్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ కమిటీ, సంస్థ డైరెక్టర్ల బోర్డు బుధవారం సమావేశంలో పూజా జైన్‌ను చీఫ్‌గా నియమించినట్టు భారతీ ఇన్‌ఫ్రాటెల్ ప్రకటించింది. పూజా జైన్ చార్టర్డ్ అకౌంటెంట్ చేశారు. ఇందులో 17 సంవత్సరాల అనుభవం ఉంది. ఆమె భారతీ ఎయిర్‌టెల్‌లో 3 సంవత్సరాలు, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లో 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.