భారత్ బంద్ కేవలం నాలుగు గంటలే
దిశ, వెబ్‌డెస్క్: రైతుల సంఘాలు రేపు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో సమయం మార్పులు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకే బంద్ నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ వెల్లడించారు. తమ బంద్ ద్వారా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే కేవలం నాలుగు గంటలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉద్యోగులు తమ విధుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లే వారు నిరభ్యంతరంగా వెళ్లవచ్చని చెప్పారు. […]
దిశ, వెబ్‌డెస్క్: రైతుల సంఘాలు రేపు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో సమయం మార్పులు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకే బంద్ నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ వెల్లడించారు. తమ బంద్ ద్వారా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే కేవలం నాలుగు గంటలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఉద్యోగులు తమ విధుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లే వారు నిరభ్యంతరంగా వెళ్లవచ్చని చెప్పారు. అత్యవసర సర్వీసులైన అంబులెన్స్‌లు, పెళ్లిళ్లు యథావిథిగానే జరుగుతాయని పేర్కొన్నారు. తమ నిరసనను శాంతియుతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని రాకేశ్ టికాయత్ చెప్పుకొచ్చారు.