ఢిల్లీ: నిన్న ఎర్రకోట వద్ద నాయకత్వం వహించింది మనోడే
దిశ, ముధోల్: భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పండుగలా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఏర్పాట్లు చేసి, వైభవంగా నిర్వహిస్తారు. అలాంటి వేడుకలను కొందరు దగ్గరనుంచి చూస్తే చాలనుకుంటారు. కానీ, మన తెలంగాణ బిడ్డ ఏకంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సాహస విన్యాసాలకు నాయకత్వం వహించాడు. వివరాళ్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా బైంసా మండలం బ్రాహ్మణ గల్లికి చెందిన కుల్దీప్ నిరల్కర్, గత 12 సంవత్సరాలుగా భారత నావికా దళంలో […]
దిశ, ముధోల్: భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పండుగలా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఏర్పాట్లు చేసి, వైభవంగా నిర్వహిస్తారు. అలాంటి వేడుకలను కొందరు దగ్గరనుంచి చూస్తే చాలనుకుంటారు. కానీ, మన తెలంగాణ బిడ్డ ఏకంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సాహస విన్యాసాలకు నాయకత్వం వహించాడు. వివరాళ్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా బైంసా మండలం బ్రాహ్మణ గల్లికి చెందిన కుల్దీప్ నిరల్కర్, గత 12 సంవత్సరాలుగా భారత నావికా దళంలో పనిచేస్తున్నాడు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ జెండావిష్కరణ సమయంలో ప్రతిఏటా త్రివిధ దళాలు, నావికా, వాయు, సైనిక మరియు ఢిల్లీ పోలీసులు చేసే వందన సమర్పణ చేసే సంగతి తెలిసిందే.
ప్రతీ సంవత్ససం వందన సమర్పణకు ఒక వింగ్ కమాండర్‌ను నియమించి, నాయకత్వం వహించేలా చేస్తారు. సైనికుల విన్యాసాల బాధ్యత మొత్తం తనపైనే ఉంటుంది. అయితే, ఈసారి ఆ అవకాశం నావికా దళానికి దక్కగా, కమాండర్‌గా బైంసాకు చెందిన కుల్దీప్ నిరల్కర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. దీంతో దేశ స్వాతంత్ర్య వేడుకల్లో జిల్లా వాసి కీలకపాత్ర పోషించడంతో బైంసా పట్టణ ప్రజలు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇస్టాగ్రామ్ వేదికల్లో పోస్టులు పెట్టి గర్వంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
మా పరిస్థితేంటి మాహాప్రభో.. మాజీ సైనికుల ఆందోళన
హై కోర్టు సంచలన వ్యాఖ్యలు: అమ్మాయిలు సరదా కోసం సెక్స్ చేయడం లేదు..