భద్రాచలంలో గణేష్ నిమజ్జనం.. కరకట్టపైనే కట్టడి చేయనున్న పోలీసులు

దిశ, భద్రాచలం టౌన్: గణేశ్ నవరాత్రి మహోత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. దీంతో నిమజ్జనోత్సవాలకు భద్రాచలం గోదావరి వద్ద అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశారు. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలం వద్ద పవిత్ర గోదావరిలో నిమజ్జనం చేయడానికి భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా విగ్రహాలు తీసుకొస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాల నిమజ్జనం దాదాపు రెండుమూడు రోజులపాటు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటులేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. భక్తులు నిమజ్జనాలను […]

Update: 2021-09-18 11:38 GMT

దిశ, భద్రాచలం టౌన్: గణేశ్ నవరాత్రి మహోత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. దీంతో నిమజ్జనోత్సవాలకు భద్రాచలం గోదావరి వద్ద అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశారు. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలం వద్ద పవిత్ర గోదావరిలో నిమజ్జనం చేయడానికి భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా విగ్రహాలు తీసుకొస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాల నిమజ్జనం దాదాపు రెండుమూడు రోజులపాటు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటులేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. భక్తులు నిమజ్జనాలను చూడటానికి భారీగా భక్తులు తరలిరానున్నారు.

అయితే.. గోదావరి నీటి చెంతకు భక్తులు వెళ్లకుండా కరకట్టపైనే పోలీసులు కట్టడి చేయనున్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తారు. ఇప్పటికే ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది నిమజ్జనం పాయింట్ వద్ద ఏర్పాట్లు చేసుకున్నారు. భద్రాచలం ఇన్‌చార్జీ సబ్ కలెక్టర్, జెసీ వెంకటేశ్వర్లు, భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్‌ల అదేశాల మేరకు పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, గ్రామ పంచాయతీ, ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది నిమజ్జనోత్సవ ఏర్పాట్లు పరిశీలించారు. ఈ నేపథ్యంలో భద్రాచలం టౌన్ సీఐ స్వామి శనివారం సాయంత్రం పలు సూచనలు చేశారు. ఆదివారం అన్నిదారుల నుంచి విగ్రహాలతో భక్తులు భద్రాచలం వచ్చే అవకాశాలు ఉన్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News