ఈ నెల 8 నుంచి భద్రాద్రి రాముడి దర్శన భాగ్యం
దిశ, ఖమ్మం: ఈ నెల 8 నుంచి భద్రాచలం రామాలయం పున:ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు అందినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు మూతపడిన విషయం తెలిసిందే. పదేళ్లలోపు పిల్లలకు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆలయంలోకి అనుమతి ఉండబోదని అధికారులు తెలిపారు. భక్తులకు దేవస్థానం పరిధిలో కాటేజీ సౌకర్యం కూడా ఉండదన్నారు. ఆలయంలోకి ప్రవేశించడానికి ముందే […]
దిశ, ఖమ్మం: ఈ నెల 8 నుంచి భద్రాచలం రామాలయం పున:ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు అందినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు మూతపడిన విషయం తెలిసిందే. పదేళ్లలోపు పిల్లలకు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆలయంలోకి అనుమతి ఉండబోదని అధికారులు తెలిపారు. భక్తులకు దేవస్థానం పరిధిలో కాటేజీ సౌకర్యం కూడా ఉండదన్నారు. ఆలయంలోకి ప్రవేశించడానికి ముందే భక్తులకు థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు.