సగం బీరు తాగినా సమస్యలే!
దిశ, వెబ్‌డెస్క్: నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో.. ఉద్యోగస్తుల ఎక్కువ సమయం పనిచేస్తున్న సంస్థల్లో ఎల్‌ఈడీ కాంతుల మధ్యే గడిచిపోతుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సరదాగా గడిపేంత తీరిక దొరకడం లేదనే చెప్పాలి. ఆఫీస్ పనులను, ఫ్యామిలీని కో ఆర్డినేట్ చేసుకుంటే తప్ప ఫ్రెండ్స్‌ను ఎప్పటికో కలిసే చాన్స్ లేదు. దీంతో చాలా మంది ఏదో ఒక రోజు ఈవినింగ్ టైమ్‌లో ఓ గంట పాటు ఫ్రెండ్స్‌తో గడిపేందుకు మొగ్గు చూపుతుంటారు. అదే టైమ్‌లో సరదాగా బీరు తాగుతూ […]
దిశ, వెబ్‌డెస్క్: నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో.. ఉద్యోగస్తుల ఎక్కువ సమయం పనిచేస్తున్న సంస్థల్లో ఎల్‌ఈడీ కాంతుల మధ్యే గడిచిపోతుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సరదాగా గడిపేంత తీరిక దొరకడం లేదనే చెప్పాలి. ఆఫీస్ పనులను, ఫ్యామిలీని కో ఆర్డినేట్ చేసుకుంటే తప్ప ఫ్రెండ్స్‌ను ఎప్పటికో కలిసే చాన్స్ లేదు. దీంతో చాలా మంది ఏదో ఒక రోజు ఈవినింగ్ టైమ్‌లో ఓ గంట పాటు ఫ్రెండ్స్‌తో గడిపేందుకు మొగ్గు చూపుతుంటారు. అదే టైమ్‌లో సరదాగా బీరు తాగుతూ చిల్ అవుతుంటారు. ఒకవేళ డ్రైవింగ్ గుర్తొచ్చి వారించినా.. ఒకటి, రెండు గ్లాసులు తాగితే ఏం కాదులే! అని ఫ్రెండ్స్ బలవంతం చేయడం మామూలే. ఇలా హడావిడిగా తాగేసి, యథావిధిగా ఇంటికి వెళ్దామనుకుంటారు. కానీ, హాఫ్ బీర్ తాగినా సరే.. డ్రైవింగ్‌తో పాటు మనం చేసే ఇతర పనులపై అధిక ప్రభావం చూపుతుందని తాజా పరిశీలనలో తేలింది.
నాసా(అమెరికా అంతర్జాతీయ పరిశోధనా సంస్థ) అధ్యయనం ప్రకారం రెండు గ్లాసులు లేదా హాఫ్ బాటిల్ బీరు (అంతకంటే తక్కువైనా) తాగినా.. అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిర్ధారించబడింది. కాలిఫోర్నియాలోని నాసా పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో జరిపిన ఈ స్టడీలో.. వారానికి సగటున ఒకటి లేదా రెండు గ్లాసుల మద్యం తాగే 20 ఏళ్ల వయసు గల యువతీ యువకులు(వాలంటీర్లు) పాల్గొన్నారు. వీరిలో కొందరికి 0.06 %, మరికొందరికి 0.02 ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్న డ్రింక్స్‌ను రోజూ తాగించి అబ్జర్వేషన్‌లో ఉంచారు. పరిశోధనా క్రమంలో.. వారి హెల్త్‌పై ఆల్కహాల్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు గాను టెస్టులకు ముందు రోజు మద్యం ఇవ్వకుండా.. 21 రకాల కంటి కొలతలు తీసుకొన్నారు. న్యూరల్ ప్రాసెసింగ్(నరాల పనితీరు), కంటి కదలికలు ఎలా ఉన్నాయి? వారి స్పందన ఎలా ఉంది? మానసిక పరిస్థితి ఏంటనే విషయాలపై అధ్యయనం చేశారు.
కాగా, కొద్దిమొత్తంలో మద్యం తాగి వెహికల్స్ నడిపే వారిలో కంటిచూపు మందగిస్తుందని తేలింది. డ్రైవింగ్ చేసే సమయంలో చేతి నరాలకు మెదడు నుంచి పంపే సంకేతాలు అందకుండా పోతాయని, తద్వారా నరాల సమన్వయం దెబ్బతినే ప్రమాదముందని అధ్యయనంలో స్పష్టమైందని పరిశోధకుడు టెరెన్స్ టైసన్ వివరించారు. రక్తంలో ఆల్కహాల్ సాంద్రత 0.015 శాతానికి పడిపోతే కంటికి, చేతికి ఉన్న సమన్వయం 20 శాతం మేర తగ్గుతుందని గుర్తించారు. కాగా ఆల్కహాల్.. కళ్లు, నాడీ వ్యవస్థ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు మరోసారి అధ్యయనం చేయనున్నట్లు నాసా పరిశోధకులు చెప్పారు. మానవుల నాడీ వ్యవస్థ, హెల్త్‌పై ప్రభావం చూపే తేలికపాటి కండిషన్స్ ఏంటో తెలుసుకునేందుకు నాసా ప్రయత్నిస్తోందని తెలిపారు.