కరోనా ఆస్పత్రిగా ‘గాంధీ’: శ్రీనివాసరావు

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా అవసరమైతే గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో కొవిడ్ పేషెంట్లకే వినియోగిస్తామని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటే కరోనా రోగుల్ని మాత్రమే గాంధీ ఆసుపత్రిలోకి అనుమతిస్తామన్నారు. ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంత మంది రోగులు వచ్చినా మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. వ్యాధిని అరికట్టేందుకు వైద్యశాఖ అన్ని చర్యలు చేపడుతోందన్నారు. కరోనా రోగుల సంఖ్య పెరిగితే సాధారణ రోగులను […]

Update: 2021-03-23 12:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా అవసరమైతే గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో కొవిడ్ పేషెంట్లకే వినియోగిస్తామని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటే కరోనా రోగుల్ని మాత్రమే గాంధీ ఆసుపత్రిలోకి అనుమతిస్తామన్నారు. ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంత మంది రోగులు వచ్చినా మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. వ్యాధిని అరికట్టేందుకు వైద్యశాఖ అన్ని చర్యలు చేపడుతోందన్నారు. కరోనా రోగుల సంఖ్య పెరిగితే సాధారణ రోగులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తామన్నారు.

Tags:    

Similar News