నన్ను నమ్మండి, నేను కట్టిస్తా: మాజీ ఎమ్మెల్యే రామ్‌మోహన్‌రెడ్డి

దిశ, పరిగి : ప్రతి వర్షాకాలం రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాగుపై వంతెన నిర్మిస్తే సమస్య తీరుతుందని డీసీసీ అధ్యక్షులు, పరిగి మాజీ ఎమ్మెల్యే తమ్మన్నగారి రామ్‌‌మోహన్ రెడ్డి అన్నారు. పరిగి మండల పరిధిలోని చిగురాలపల్లి పెద్ద, చిన్న వాగులపై వంతెనలు లేక రైతులు ప్రతి వర్షాకాలంలో నానా అవస్థలు పడుతున్నారన్నారు. వాగుపై వంతెన నిర్మించాలని రైతులు అధికారులు, పాలకులకు వినతిపత్రాలు అందజేశామని రైతులు డీసీసీ అధ్యక్షులు టీఆర్ఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వాగు అవతలి వైపున 400 […]

Update: 2021-09-02 07:21 GMT

దిశ, పరిగి : ప్రతి వర్షాకాలం రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాగుపై వంతెన నిర్మిస్తే సమస్య తీరుతుందని డీసీసీ అధ్యక్షులు, పరిగి మాజీ ఎమ్మెల్యే తమ్మన్నగారి రామ్‌‌మోహన్ రెడ్డి అన్నారు. పరిగి మండల పరిధిలోని చిగురాలపల్లి పెద్ద, చిన్న వాగులపై వంతెనలు లేక రైతులు ప్రతి వర్షాకాలంలో నానా అవస్థలు పడుతున్నారన్నారు. వాగుపై వంతెన నిర్మించాలని రైతులు అధికారులు, పాలకులకు వినతిపత్రాలు అందజేశామని రైతులు డీసీసీ అధ్యక్షులు టీఆర్ఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వాగు అవతలి వైపున 400 ఎకరాల వ్యవసాయ పొలాలు ఉన్నాయంటూ రైతులు తెలిపారు. సమస్యలు పరిష్కరించేందుకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఇందుకు స్పందించిన డీసీసీ అధ్యక్షులు , మాజీ ఎమ్మెల్యే టి. రామ్‌‌మోహన్ రెడ్డి ఈ వంతెన నిర్మాణం గురించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సత్వర పరిష్కారం అయ్యేలా చూస్తానని హమీ ఇచ్చారు. వెదురు కట్టలతో వంతెన నిర్మించిన రైతులను ఆయన అభినందించారు. ఇలా ప్రతి ఏడాది వాగుపై వంతెన నిర్మించుకోవడం చాలా బాధకరంగా ఉందన్నారు. వెంటనే సమస్య తీవ్రతను గురించి జిల్లా కలెక్టర్‌కు తెలియజేసి, త్వరలో వంతెన నిర్మించాలంటూ రైతుల పక్షాన కోరుతానని తెలిపారు. టీఆర్ఆర్ వెంట డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, పరిగి టౌన్ ప్రెసిడెంట్ ఎర్రగడ్డపల్లి కృష్ణ, రియాజ్, మిట్టకోడూర్, చిగురాల్‌పల్లి కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News