క్రికెటర్లకు గుడ్‌న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా అస్తవ్యస్తంగా మారిన దేశవాళీ క్రికెట్‌ను పునరుద్ధరించడానికి బీసీసీఐ కసరత్తు మొదలు పెట్టింది. 2020‌లో జరగాల్సిన కీలకమైన రంజీ ట్రోఫీని పూర్తిగా రద్దు చేసిన విషయం తెలిసిందే. దానితో పాటు సీనియర్ ఉమెన్స్ వన్డే చాలెంజర్ ట్రోఫీ, మెన్స్ అండర్ 23, అండర్ 19 వినూ మన్కడ్ ట్రోఫీలు కూడా రద్దయ్యాయి. ఐపీఎల్‌ను యూఏఈకి తరలించి నిర్వహించిన బీసీసీఐ.. 2020 చివర్లో మాత్రం ఖాళీ స్టేడియంలలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని నిర్వహించింది. […]

Update: 2021-07-03 08:52 GMT

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా అస్తవ్యస్తంగా మారిన దేశవాళీ క్రికెట్‌ను పునరుద్ధరించడానికి బీసీసీఐ కసరత్తు మొదలు పెట్టింది. 2020‌లో జరగాల్సిన కీలకమైన రంజీ ట్రోఫీని పూర్తిగా రద్దు చేసిన విషయం తెలిసిందే. దానితో పాటు సీనియర్ ఉమెన్స్ వన్డే చాలెంజర్ ట్రోఫీ, మెన్స్ అండర్ 23, అండర్ 19 వినూ మన్కడ్ ట్రోఫీలు కూడా రద్దయ్యాయి. ఐపీఎల్‌ను యూఏఈకి తరలించి నిర్వహించిన బీసీసీఐ.. 2020 చివర్లో మాత్రం ఖాళీ స్టేడియంలలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని నిర్వహించింది. అయితే దేశవాళీ క్రికెట్ నిర్వహించకపోవడం వల్ల చాలా మంది క్రికెటర్లకు వేతనాలు అందకుండా పోయాయి. క్రికెట్‌నే వృత్తిగా మార్చుకున్న పలువురు క్రికెటర్లు ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడటానికి వెళ్లగా.. మరి కొంత మంది వేరే పనుల్లో చేరి కుటుంబాన్ని పోషించుకున్నారు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ అర్దాంతరంగా వాయిదా పడటంతో పాటు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కూడా ఇండియా నుంచి తరలి వెళ్లిపోవడంతో ఈ సారైనా దేశవాళీ క్రికెట్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేసింది.

నవంబర్‌లో రంజీ ట్రోఫీ..

కరోనా కారణంగా రద్దయిన రంజీ ట్రోఫీ సీజన్.. ఈ ఏడాది తిరిగి నిర్వహించనున్నారు. నవంబర్ 16 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 వరకు రంజీ ట్రోఫీని నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దేశంలోని ప్రతీ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లతో పాటు ఇతర రంజీ జట్లు కలసి 177 మ్యాచ్‌లు ఆడనున్నాయి. రంజీ ట్రోఫీ కంటే ముందు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ అక్టోబర్ 20 నుంచి నవంబర్ 12 వరకు నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 149 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక రంజీ ట్రోఫీ ముగిసిన తర్వాత వచ్చే ఏడాది (2022) విజయ్ హజారే వన్డే ట్రోఫీ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 26 వరకు మొత్తం 169 మ్యాచ్‌లు జరుగనున్నాయి. వీటితో పాటు మెన్స్ అండర్ 23 సీకే నాయుడు ట్రోఫీ, మెన్స్ స్టేట్ ఏ ట్రోఫీ, అండర్ 19 వినూ మన్కడ్ వన్డే ట్రోఫీ, అండర్ 19 వన్డే చాలెంజర్ ట్రోఫీలు జరగనున్నాయి. అండర్ 16లో కోచ్ బెహర్ ట్రోఫీ, విజయ్ మర్చంట్ ట్రోఫీ కూడా జరుగనున్నది.

ఇక మహిళలకు సంబంధించిన సీనియర్ వన్డే లీగ్‌తో పాటు సీనియర్ వన్డే ఉమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీ, ఉమెన్స్ టీ20 లీజ్ కూడా జరుగనున్నది. ఉమెన్స్ అండర్ 23, ఉమెన్స్ 19కు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేశారు.

పూర్తి షెడ్యూల్..

పురుషుల క్రికెట్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (టీ20) – 2021 అక్టోబర్ 10 నుంచి నవంబర్ 12
రంజీ ట్రోఫీ – 2021 నవంబర్ 16 నుంచి 2022 ఫిబ్రవరి 2
విజయ్ హజారే వన్డే ట్రోఫీ – 2022 ఫిబ్రవరి 23 నుంచి 2022 మార్చి 26

పురుషుల అండర్ 23

కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ – 2021 నవంబర్ 18 నుంచి 2022 ఫిబ్రవరి 12
మెన్స్ స్టేట్ ఏ వన్డే ట్రోపీ – 2022 ఫిబ్రవరి 23 నుంచి 2022 మార్చి 26

పురుషుల అండర్ 19

వినూ మన్కడ్ ట్రోఫీ (వన్డే) – 2021 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 29
మెన్స్ అండర్ 19 వన్డే ఛాలెంజర్స్ ట్రోఫీ – 2021 నవంబర్ 3 నుంచి నవంబర్ 9

బాలుర అండర్ 16

కూచ్ బెహర్ ట్రోఫీ – 2021 నవంబర్ 14 నుంచి 2022 ఫిబ్రవరి 7
విజయ్ మర్చంట్ ట్రోఫీ – 2021 అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 16

మహిళల సీనియర్ క్రికెట్

సీనియర్ మహిళల వన్డే లీగ్ – 2021 సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 22
సీనియర్ మహిళల వన్డే ఛాలెంజర్ ట్రోఫీ – 2021 అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 31
సీనియర్ మహిళల టీ20 లీగ్ – 2022 మార్చి 19 నుంచి 2022 ఏప్రిల్ 11

మహిళలు అండర్ 23

మహిళల అండర్ 23 టీ20 లీగ్ – 2022 జనవరి 17 నుంచి 2022 ఫిబ్రవరి 7
మహిళల అండర్ 23 వన్డే లీగ్ – 2022 ఫిబ్రవరి 11 నుంచి 2022 మార్చి 15

మహిళల అండర్ 19

మహిళల అండర్ 19 వన్డే లీగ్ – 2021 అక్టోబర్ 1 నుంచి 2021 అక్టోబర్ 31
మహిళల అండర్ 19 టీ20 లీగ్ – 2021 నవంబర్ 4 నుంచి 2021 నవంబర్ 27
మహిళల అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ – 2021 డిసెంబర్ 1 నుంచి 2021 డిసెంబర్ 5

Tags:    

Similar News