INDvsBAN: ‘ఇక్కడ ఫీల్డర్ పెట్టుకో..’ పంత్ అంటే ఆ మాత్రం ఉంటది మరి

Update: 2024-09-21 07:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌ (Bangladesh)తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్‌లో టీమిండియా (Team India) దుమ్ము దులుపుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టాపార్డర్ కుప్పకూలినా మిడిల్ ఆర్డర్లో రవిచంద్రన్ అశ్విన్ (Ravi Chandran Ashwin) సెంచరీతో, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) హాఫ్ సెంచరీతో అదరగొట్టి జట్టుకు మంచి స్కోరును అందించారు. ఇక మన బౌలర్ల దెబ్బకు బంగ్లా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో టీమిండియాకి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించింది. ఇక ఇప్పుడు రెండో రిషభ్ పంత్ (100), శుభ్‌మన్ గిల్ (119 నాటౌట్) సెంచరీలతో అదరగొట్టడంతో ఈ మ్యాచ్‌లో మనం గెలవడం దాదాపు ఖరారైపోయింది.

ఇలాంటి టైంలో రిషభ్ పంత్‌కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న పంత్ (Rishabh Pant).. ఏకంగా బంగ్లా కెప్టెన్‌ శాంటో (Bangladesh Captain Nazimul Shanto)కి ఫీల్డింగ్ సెట్ చేసుకోవడం సలహాలిచ్చాడు. విచిత్రం ఏంటంటే పంత్ చెప్పగానే శాంటో కూడా అక్కడ ఫీల్డర్‌ని సెట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్ ఫ్యాన్స్‌ (Cricket Fans) కి తెగ నచ్చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ‘మరి మా పంత్ అంటే ఏం అనుకున్నారు. ఆ మాత్రం ఉంటది మరి..’ అని ఓ యూజర్ కామెంట్ చేస్తే.. ‘పంత్‌తో మామూలుగా ఉండదు.. చెప్పి మరీ కొట్టే రకం మావాడు.. జాగ్రత్త!’ అంటూ ఇంకో నెటిజన్‌ రాసుకొచ్చాడు. ఏది ఏమైనా పంత్ చేసిన ఈ పని ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో తెగ రచ్చ చేస్తోంది. 


Similar News