టెండర్ల గడువు పెంచిన బీసీసీఐ
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ కొత్త జట్ల కోసం టెండర్ల డాక్యుమెంట్లు కొనే గడువును బీసీసీఐ మరోసారి పెంచింది. గతంలో ఐటీటీ డాక్యుమెంట్ కొనుగోలుకు అక్టోబర్ 10 వరకు గడువు ఇచ్చింది. తాజాగా ఆ గడువును అక్టోబర్ 20 వరకు పెంచింది. కాగా, ఐపీఎల్ 2022లో రాబోయే కొత్త జట్లకు సంబంధించిన టెండర్లను అక్టోబర్ 25న తెరవనున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే టెండర్లలో పాల్గొనే సంస్థలు/కన్సార్టియంలో తప్పకుండా ఐటీటీని కొనుగోలు చేయాలి. ఈ నెల 20 లోపు రూ. […]
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ కొత్త జట్ల కోసం టెండర్ల డాక్యుమెంట్లు కొనే గడువును బీసీసీఐ మరోసారి పెంచింది. గతంలో ఐటీటీ డాక్యుమెంట్ కొనుగోలుకు అక్టోబర్ 10 వరకు గడువు ఇచ్చింది. తాజాగా ఆ గడువును అక్టోబర్ 20 వరకు పెంచింది. కాగా, ఐపీఎల్ 2022లో రాబోయే కొత్త జట్లకు సంబంధించిన టెండర్లను అక్టోబర్ 25న తెరవనున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే టెండర్లలో పాల్గొనే సంస్థలు/కన్సార్టియంలో తప్పకుండా ఐటీటీని కొనుగోలు చేయాలి. ఈ నెల 20 లోపు రూ. 10 లక్షలు చెల్లించి ఈ డాక్యుమెంట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొత్త జట్ల కనీస ధర రూ. 2000 కోట్లగా బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఈ సారి కొత్త జట్ల కోసం భారీ పోటీ నెలకొనడంతో ఈ ధర రూ. 3500 వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అహ్మదాబాద్, లక్నో, పూణే కేంద్రలుగా కొత్త జట్లకు టెండర్లు పిలవగా.. అహ్మదాబాద్, లక్నో కేంద్రంగా జట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.