కోహ్లీపై వస్తున్న వార్తలపై బీసీసీఐ క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. కోహ్లీ తప్పుకుంటున్నట్లు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, కోహ్లీ సమాచారం ఇస్తే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఒకవేళ విశ్రాంతి తీసుకోవాలనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లీ ఆడతాడనే తాము భావిస్తున్నామని బీసీసీఐ ఉన్నతాధికారి తెలిపారు. […]
దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. కోహ్లీ తప్పుకుంటున్నట్లు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, కోహ్లీ సమాచారం ఇస్తే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఒకవేళ విశ్రాంతి తీసుకోవాలనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.
దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లీ ఆడతాడనే తాము భావిస్తున్నామని బీసీసీఐ ఉన్నతాధికారి తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. దీని పట్ల కోహ్లీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడని, అందుకే దక్షిణాఫ్రికా పర్యటనకు దూరం కానున్నాడని వార్తలొస్తున్నాయి. కాగా జనవరి 19 నుంచి 23 వరకు దక్షిణాఫ్రికాతో మూడు వన్డే మ్యాచ్ లు టీమిండియా ఆడనుంది.