‘చార్లెస్ శోభరాజ్’ విడుదల అప్పుడే!

దిశ, వెబ్‌డెస్క్ : నటోరియస్ క్రిమినల్, సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌ను ఆధారంగా చేసుకుని వస్తున్న సిరీస్ ‘ద సర్పెంట్’. టామ్ షంక్‌లాండ్, హన్స్ హెర్మోట్స్ దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్‌ క్రిస్మస్, న్యూఇయర్ కానుకగా బీబీసీ1లో టెలీకాస్ట్ కానున్నట్లు మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. ఇంతకీ చార్లెస్ ఏం చేశాడు? ఇండియా, థాయ్‌లాండ్, నేపాల్‌తో పాటు మరిన్ని దేశాలకు చెందిన 20 మంది యంగ్ వెస్టర్న్ ట్రావెలర్స్‌ను అతి క్రూరంగా హత్య […]

Update: 2020-12-06 07:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నటోరియస్ క్రిమినల్, సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌ను ఆధారంగా చేసుకుని వస్తున్న సిరీస్ ‘ద సర్పెంట్’. టామ్ షంక్‌లాండ్, హన్స్ హెర్మోట్స్ దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్‌ క్రిస్మస్, న్యూఇయర్ కానుకగా బీబీసీ1లో టెలీకాస్ట్ కానున్నట్లు మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది.

ఇంతకీ చార్లెస్ ఏం చేశాడు?

ఇండియా, థాయ్‌లాండ్, నేపాల్‌తో పాటు మరిన్ని దేశాలకు చెందిన 20 మంది యంగ్ వెస్టర్న్ ట్రావెలర్స్‌ను అతి క్రూరంగా హత్య చేసి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాల సరఫరా వంటి నేరాల్లోనూ శోభరాజ్‌ పలుసార్లు పోలీసులకు పట్టుబడి, అరెస్ట్ కాబడ్డాడు. 20వ శతాబ్దంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా నిలిచిన శోభారాజ్‌పై 1976లో మూడు ఖండాల్లో అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. 1986లో న్యూఢిల్లీలోని తీహార్ జైల్ సెక్యూరిటీ సిబ్బందికి మత్తు మందు ఇచ్చి పరారైన శోభరాజ్.. ఆ తర్వాత కూడా అమెరికా, నేపాల్‌లోనూ పలు నేరాలకు పాల్పడి కొంతకాలం జైల్లో గడిపాడు. ఇక 2003లో నేపాల్‌లోని ఓ క్యాసినో నుంచి తప్పించుకునే క్రమంలో ఖాట్మాండు పోలీసులకు చిక్కడంతో అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా పలు హత్యానేరాలకు సంబంధించి నేపాల్ ప్రభుత్వం అతడికి జీవిత ఖైదు విధించడంతో.. ప్రస్తుతం చార్లెస్ శోభరాజ్ ఖాట్మాండు జైల్లోనే ఉన్నాడు.

ద సర్పెంట్‌ కాస్ట్ :

ప్రస్తుతం శోభరాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ద సర్పెంట్’ వెబ్ సిరీస్‌లో అవార్డ్ విన్నింగ్ ఫ్రెంచ్ యాక్టర్ తాహర్ రహీం చార్లెస్ పాత్రను పోషిస్తున్నాడు. విక్టోరియా యాక్ర్టెస్ జెన్నా కోల్మన్ శోభరాజ్ పార్టనర్‌గా కనిపించనుంది. ఇక శోభరాజ్‌ తరపున పోరాడుతున్న న్యాయవాది హెర్మన్ నిప్పెన్‌బెర్గ్ పాత్రలో బిల్లీ హౌలే నటిస్తున్నాడు. టిమ్ మ్యాక్ ఇన్నెర్నీ, ఎలైస్ ఎంగ్లెర్ట్, మాథిల్డే వార్నియర్, గ్రెగోయిర్ ఇస్వరైన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఎప్పుడు ప్రసారం కానుంది?

న్యూ ఇయర్ కానుకగా, ఆ రోజు రాత్రి 9 గంటలకు బీబీసీ1లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. మొత్తం 8 ఎపిసోడ్‌లతో దీన్ని రూపొందించారు.

Tags:    

Similar News