వివిధ డిజైన్లలో బతుకమ్మ చీరలు: కేటీఆర్

దిశ, కరీంనగర్: నేతన్నలకు జీవనోపాధి కలిగించేందుకు ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నామని చెప్పారు. సోమవారం సిరిసిల్ల జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… భారత దేశంలోనే అతి పెద్ద కాకతీయ టెక్స్ట్ టైల్ పార్క్ వరంగల్, సిరిసిల్లలో ఏర్పాటు చేశామని, నేతన్నలకు బాసటగా నిలవాలన్న సంకల్పంతో 50 శాతం సబ్సిడీ కూడా ఇస్తున్నామన్నారు. రూ. 14. 50 కోట్లతో టెక్స్ టైల్ పార్క్ లో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. కరోనా నేపథ్యంలో కార్మికులు […]

Update: 2020-05-11 04:36 GMT

దిశ, కరీంనగర్: నేతన్నలకు జీవనోపాధి కలిగించేందుకు ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నామని చెప్పారు. సోమవారం సిరిసిల్ల జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… భారత దేశంలోనే అతి పెద్ద కాకతీయ టెక్స్ట్ టైల్ పార్క్ వరంగల్, సిరిసిల్లలో ఏర్పాటు చేశామని, నేతన్నలకు బాసటగా నిలవాలన్న సంకల్పంతో 50 శాతం సబ్సిడీ కూడా ఇస్తున్నామన్నారు. రూ. 14. 50 కోట్లతో టెక్స్ టైల్ పార్క్ లో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. కరోనా నేపథ్యంలో కార్మికులు వెళ్లిపోతుంటే పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోతుందన్నారు. లాభాలు ఆర్జిస్తున్న యజమానులు కార్మికుల శ్రేయస్సు చూడాలని, టెక్స్ టైల్ పార్క్ లో పారిశుద్ధ్యం బాధ్యత యజమానులదేనని మంత్రి స్పష్టం చేశారు. టెక్స్ టైల్ పార్క్ అసోసియేషన్ ఆధ్వర్వంలో డబ్బులు జమ చేసుకుని టాయిలెట్స్ కట్టించాలన్నారు. పరిశుభ్రమైన వాతావరణం పార్క్ లో ఉండేందుకు చొరవ చూపాలని, యజమానులు కార్మికులతో ఒప్పందం చేసుకున్న విధంగా వ్యవహరించాలని, కార్మికులు సమ్మె చేసే పరిస్థితి రాకుండా చూడాలన్నారు. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకం కావాలని యాజమాన్యాలు అడిగాయని.. ప్రభుత్వం అందుకు సిద్దంగా ఉందన్నారు. విద్యుత్ వినియోగంపై బిల్లులు వస్తాయని, మూడు నెలల బిల్లులు వాయిదా వేశామని కేటీఆర్ తెలిపారు. కేంద్రం సాయాన్ని కోరుతూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశామన్నారు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ ద్వారా రూ. కోటి 80 లక్షలు వెచ్చించి మూలనపడే సంస్థలకు సాయం అందించామని మంత్రి చెప్పారు. బతకమ్మ చీరలను వివిధ డిజైన్లలో తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నామని కేటీఆర్ తెలిపారు.

Tags:    

Similar News