బ్యాంకులు కార్పొరేట్ గవర్నెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్‌లను బలోపేతం చేయాలి'!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం వల్ల ఏర్పడ్డ సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్ రంగంలో కార్పొరేట్ గవర్నెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ పద్దతులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ మంగళవారం తన నివేదికలో తెలిపింది. డిజిటల్ చెల్లింపులు వేగవంతంగా ఉండటం, ఫిన్‌టెక్ సంస్థలు పెరుగుతుండటంతో బ్యాంకులు తమ సైబర్ భద్రతను పటిష్టం చేయడంతో పాటు ఐటీ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాలని, వినియోగదారుల సేవలను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. పెరుగుతున్న అనిశ్చిత పరిస్థితుల్లో స్థిరత్వాన్ని పెంచేందుకు బ్యాంకులు […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం వల్ల ఏర్పడ్డ సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్ రంగంలో కార్పొరేట్ గవర్నెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ పద్దతులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ మంగళవారం తన నివేదికలో తెలిపింది. డిజిటల్ చెల్లింపులు వేగవంతంగా ఉండటం, ఫిన్‌టెక్ సంస్థలు పెరుగుతుండటంతో బ్యాంకులు తమ సైబర్ భద్రతను పటిష్టం చేయడంతో పాటు ఐటీ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాలని, వినియోగదారుల సేవలను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. పెరుగుతున్న అనిశ్చిత పరిస్థితుల్లో స్థిరత్వాన్ని పెంచేందుకు బ్యాంకులు కార్పొరేట్ గవర్నెన్స్ పద్దతులు, రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యూహాలను పటిష్ఠం చేయాలని నివేదిక తెలిపింది.
రానున్న రోజుల్లో బ్యాంకు బ్యాలెన్స్ షీట్లలో పునరుద్ధరణ మొత్తం ఆర్థిక వృద్ధిపై ఆధారపడి ఉంటుంది. అలాగే, క్రెడిట్‌ను కొనసాగించడానికి బ్యాంకులు తమ మూలధన మొత్తాన్ని పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు క్రెడిట్ వృద్ధిలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే 11 శాతం నుంచి 10.1 శాతానికి మెరుగుపడిందని ఆర్‌బీఐ నివేదిక వివరించింది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు ఏడాదిలో 6.9 శాతానికి తగ్గింది. ఇక, 2021-22 మొదటి ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య వివిధ బ్యాంకింగ్ కార్యకలాపాల ఫ్రాడ్ కేసుల సంఖ్య గతేడాదిలో 3,499 నుంచి 4,071కి పెరిగాయని నివేదిక పేర్కొంది. అయితే, విలువ పరంగా ఇది రూ. 64,261 కోట్ల నుంచి రూ. 36,342 కోట్లకు తగ్గిందని వెల్లడించింది.