రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ బరోడా!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా పండుగ సీజన్ సందర్భంగా రిటైల్ రుణాలకు సంబంధించి ప్రత్యేక ఆఫర్లను గురువారం ప్రకటించింది. గృహ, వాహన రుణాలకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా గృహ, కారు రుణాల కోసం వడ్డీ రేట్లను 0.25 శాతం మినహాయింపును ఇచ్చింది. దీంతో పాటు గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కూడా ఇస్తున్నట్టు బ్యాంకు పేర్కొంది. సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా పండుగ సీజన్ సందర్భంగా రిటైల్ రుణాలకు సంబంధించి ప్రత్యేక ఆఫర్లను గురువారం ప్రకటించింది. గృహ, వాహన రుణాలకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా గృహ, కారు రుణాల కోసం వడ్డీ రేట్లను 0.25 శాతం మినహాయింపును ఇచ్చింది. దీంతో పాటు గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కూడా ఇస్తున్నట్టు బ్యాంకు పేర్కొంది. సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. గృహ రుణాలపై వడ్డీ రేట్లు 6.75 శాతం నుంచి, కారు రుణాలపై 7 శాతం నుంచి ప్రారంభమవుతాయని బ్యాంకు వివరించింది. కొవిడ్ మహమ్మారి పరిస్థితులు కొనసాగుతున్న కారణంగా వినియోగదారులు రుణ ప్రక్రియను వేగవంతంగా జరిగేందుకు, డోర్‌స్టెప్ సర్వీసుల కోసం ఎంపిక చేసుకోవచ్చు. తక్షణ రుణ మంజూరు కోసం బ్యాంకు యాప్‌లో కానీ, వెబ్‌సైట్‌లో కానీ దరఖాస్తు చేసుకోవచ్చని బ్యాంకు తెలిపింది.