బంగ్లాదేశ్ జట్టు శ్రీలంక పర్యటన ఖరారు
దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడిన శ్రీలంక, బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌ను అక్టోబర్‌లో నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు భావిస్తున్నాయి. ఈ మేరకు టెస్టు సిరీస్‌ను రీషెడ్యూల్ చేయడానికి అంగీకారానికి వచ్చాయి. అదే సమయంలో యూఏఈలో ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. కానీ, ఈ పర్యటన వల్ల ఐపీఎల్‌కు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని తెలుస్తున్నది. ఐపీఎల్ సీజన్ 13లో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆడటం లేదు. ఏ ఫ్రాంచైజీ కూడా వీళ్లను కొనుక్కోకపోవడంతో ఐపీఎల్‌కు […]
దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడిన శ్రీలంక, బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌ను అక్టోబర్‌లో నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు భావిస్తున్నాయి. ఈ మేరకు టెస్టు సిరీస్‌ను రీషెడ్యూల్ చేయడానికి అంగీకారానికి వచ్చాయి. అదే సమయంలో యూఏఈలో ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. కానీ, ఈ పర్యటన వల్ల ఐపీఎల్‌కు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని తెలుస్తున్నది. ఐపీఎల్ సీజన్ 13లో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆడటం లేదు. ఏ ఫ్రాంచైజీ కూడా వీళ్లను కొనుక్కోకపోవడంతో ఐపీఎల్‌కు దూరమయ్యారు. సన్ రైజర్స్ తరఫున షకీబుల్ హసన్ ఆడుతున్నాడు. కానీ, అతడిపై ఐసీసీ నిషేధం ఉండటంతో క్రికెట్‌కు దూరమయ్యాడు. శ్రీలంక నుంచి లసిత్ మలింగ, ఆల్ రౌండర్ ఇరుసు ఉదానా ఐపీఎల్‌లో ఆడుతున్నారు. వీరిద్దరు శ్రీలంక టెస్టు జట్టులో సభ్యులు కాదు. వీరికి శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్‌ఓసీ మంజూరు చేయడంతో ఇబ్బందులు లేవు. కిట్ స్పాన్సర్ లభించడంతో శ్రీలంక క్రికెట్‌కు ఆర్థిక ఇబ్బందులు తొలిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో అక్టోబర్‌లో టెస్టు సిరీస్ నిర్వహణకు ఇబ్బందులు ఉండవని ఎస్ఎల్‌సీ భావిస్తున్నది.