మన కార్గో ఫ్లైట్స్ కు బంగ్లాదేశ్ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో.. పలు రాష్ట్రాల్లో నిత్యావసరాల కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా ఈశాన్య భారతంలోని రాష్ట్రాలకు సరుకుల రవాణా ఆగిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు రవాణా కష్టతరం కావడంతో.. గత వారం నిత్యావసరాల సరఫరా, సరుకుల రవాణా బృందాలు విదేశీ వ్యవహారాల శాఖ, హోం శాఖ ద్వారా బంగ్లాదేశ్‌తో చర్చలు జరిపారు. అస్సాం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలకు కార్గో విమానాల ద్వారా సరుకుల రవాణా […]

Update: 2020-04-06 03:11 GMT

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో.. పలు రాష్ట్రాల్లో నిత్యావసరాల కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా ఈశాన్య భారతంలోని రాష్ట్రాలకు సరుకుల రవాణా ఆగిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు రవాణా కష్టతరం కావడంతో.. గత వారం నిత్యావసరాల సరఫరా, సరుకుల రవాణా బృందాలు విదేశీ వ్యవహారాల శాఖ, హోం శాఖ ద్వారా బంగ్లాదేశ్‌తో చర్చలు జరిపారు. అస్సాం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలకు కార్గో విమానాల ద్వారా సరుకుల రవాణా చేయాలనుకుంటున్నామని.. అందుకోసం బంగ్లాదేశ్ గగనతలం వాడుకుంటామని అభ్యర్థించారు. దీనికి బంగ్లా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా మహమ్మారి ప్రభావంతో గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ విమానసర్వీసులను నిలిపేసింది. అన్ని విమానాలు అక్కడ ఎయిర్ పోర్టులకే పరిమితం అయ్యాయి.

నిత్యావసరాలు, మందులు, ఇతర సామగ్రిని తీసుకొని తొలి విమానం మార్చి 30న గౌహతీకి చేరుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విమానం దిమాపూర్‌కు వెళ్లిందని.. అలాగే మరో రెండు విమానాలు నాగాలాండ్, మణిపూర్‌కు వెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో బంగ్లాదేశ్ సహాయానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Tags: Coronavirus, bangladesh, airspace, green signal, cargo flights, transport, necessaries

Tags:    

Similar News