అప్పుడు ఆగ్రహం..ఇప్పుడు అందజేత

దిశ, కరీంనగర్ సివిల్ హాస్పిటల్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంగళవారం స్వయంగా మాస్కులు కొనుగోలు చేసి అందజేశారు. గత పర్యటన సందర్భంగా ఎలాంటి రక్షణ లేకుండా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని గమనించిన ఆయన ఆస్పత్రి ఇంచార్జిని తీవ్రంగా మందలించారు. ఈ నేపథ్యంలో ఎంపీ స్వయంగా ఎన్ 95 మాస్కులతో పాటు, పీపీఐ కిట్లను కొనుగోలు చేసి వైద్య సిబ్బందికి అందజేశారు. లాక్ డౌన్ ముగిసే వరకు సరిపడా కిట్స్ అందజేయడంతో పాటు, […]

Update: 2020-03-31 04:43 GMT

దిశ, కరీంనగర్
సివిల్ హాస్పిటల్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంగళవారం స్వయంగా మాస్కులు కొనుగోలు చేసి అందజేశారు. గత పర్యటన సందర్భంగా ఎలాంటి రక్షణ లేకుండా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని గమనించిన ఆయన ఆస్పత్రి ఇంచార్జిని తీవ్రంగా మందలించారు. ఈ నేపథ్యంలో ఎంపీ స్వయంగా ఎన్ 95 మాస్కులతో పాటు, పీపీఐ కిట్లను కొనుగోలు చేసి వైద్య సిబ్బందికి అందజేశారు. లాక్ డౌన్ ముగిసే వరకు సరిపడా కిట్స్ అందజేయడంతో పాటు, ఐసోలేషన్ వార్డులో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బందికి అవసరమైతే మరిన్ని కిట్స్ అందజేస్తానని హామీ ఇచ్చారు. విపత్కర పరిస్థితుల్లోనూ సేవలు అందిస్తున్న పోలీసులకు నేటి నుంచి ప్రతి రోజు బట్టర్ మిల్క్ ప్యాకేట్స్, అందజేస్తామని తెలిపారు.

Tags: karimnagar, mp bandi sanjay,civil hospital,Provided masks

Tags:    

Similar News