హక్కుల కోసం గొంతెత్తడం నేరమా !
దిశ, వెబ్‌డెస్క్: నిరసన అంటేనే తట్టుకోలేని అహంకారపూరిత వైఖరి సీఎం కేసీఆర్‌దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో హక్కుల కోసం గొంతెత్తడం కూడా నేరమే అవుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన నడుస్తోందా… పోలీస్ రాజ్యం నడుస్తోందా అని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్‌పై కలెక్టరేట్ల వద్ద నిరసన చేపట్టిన బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో ఆశపెట్టి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మోసపూరిత వైఖరిని ప్రజలు […]
దిశ, వెబ్‌డెస్క్: నిరసన అంటేనే తట్టుకోలేని అహంకారపూరిత వైఖరి సీఎం కేసీఆర్‌దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో హక్కుల కోసం గొంతెత్తడం కూడా నేరమే అవుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన నడుస్తోందా… పోలీస్ రాజ్యం నడుస్తోందా అని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్‌పై కలెక్టరేట్ల వద్ద నిరసన చేపట్టిన బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో ఆశపెట్టి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారని, మున్సిపల్ ఎన్నికల్లో గట్టి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.