బంధన్ బ్యాంక్ తొలి త్రైమాసిక నిర్వహణ లాభం రూ. 1,584 కోట్లు

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బంధన్ బ్యాంక్ నికర లాభం 31.6 శాతం క్షీణించి రూ. 550 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ. 804 కోట్లుగా నమోదైంది. కొవిడ్-19 కారణంగా స్టాండర్డ్ అసెట్స్ రూ. 750 కోట్ల అదనపు సదుపాయాన్ని తీసుకున్నట్టు బంధన్ బ్యాంక్ ప్రకటించింది. ఇక, ఈ త్రైమాసికంలో నిర్వహణ లాభం 16.8 శాతం పెరిగి రూ. 1,584 కోట్లకు చేరుకుందని, గతేడాది ఇదే […]

Update: 2020-07-15 09:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బంధన్ బ్యాంక్ నికర లాభం 31.6 శాతం క్షీణించి రూ. 550 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ. 804 కోట్లుగా నమోదైంది. కొవిడ్-19 కారణంగా స్టాండర్డ్ అసెట్స్ రూ. 750 కోట్ల అదనపు సదుపాయాన్ని తీసుకున్నట్టు బంధన్ బ్యాంక్ ప్రకటించింది. ఇక, ఈ త్రైమాసికంలో నిర్వహణ లాభం 16.8 శాతం పెరిగి రూ. 1,584 కోట్లకు చేరుకుందని, గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,356 కోట్లని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే, ఈ త్రైమాసికంలో డిపాజిట్లు 6.18 శాతం పెరిగాయని వెల్లడించింది.

Tags:    

Similar News