ఎమోషనల్ థ్రిల్లర్ ‘బాలమిత్ర’ రిలీజ్ డేట్ లాక్డ్

దిశ, సినిమా: వీఎస్, శ్రీ సాయి బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్‌పై శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్ నిర్మిస్తున్న చిత్రం ‘బాలమిత్ర’. శైలేష్ తివారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీని ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ చేతుల మీదుగా ఈ సినిమాలోని ‘వెళ్లిపోమాకే’ వీడియో సాంగ్‌‌తో పాటు ట్రైలర్‌ రిలీజ్ చేయగా.. అద్భుతమైన స్పందన లభించిందని చిత్ర దర్శక నిర్మాత శైలేష్ తివారి తెలిపారు. సస్పెన్స్ థ్రిల్లర్ […]

Update: 2021-02-06 04:17 GMT

దిశ, సినిమా: వీఎస్, శ్రీ సాయి బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్‌పై శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్ నిర్మిస్తున్న చిత్రం ‘బాలమిత్ర’. శైలేష్ తివారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీని ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ చేతుల మీదుగా ఈ సినిమాలోని ‘వెళ్లిపోమాకే’ వీడియో సాంగ్‌‌తో పాటు ట్రైలర్‌ రిలీజ్ చేయగా.. అద్భుతమైన స్పందన లభించిందని చిత్ర దర్శక నిర్మాత శైలేష్ తివారి తెలిపారు.

సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో పాటు మంచి ఎమోషన్ నిండిన కథతో సినిమా ప్రతి ఒక్కరినీ అలరించే విధంగా ఉంటుందని పేర్కొన్నారు. చిత్ర నిర్మాణంలో తనకు సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్ చెప్పారు. రంగ, శశికళ, కియారెడ్డి, అనూష, దయానంద రెడ్డి, మీసాల లక్ష్మణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జయవర్ధన్ సంగీతం అందించారు.

Tags:    

Similar News