ఏఆర్ రెహమాన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య

దిశ, సినిమా : టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. ముక్కుసూటి వ్యక్తిత్వం గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఏ విషయాన్నైనా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం ఆయనకు అలవాటు. ఈ మేరకు కొన్నిసార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం సృష్టించగా.. తాజాగా ఏఆర్ రెహమాన్‌తో పాటు ‘భారతరత్న’పై ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. ఇటీవలే ఒక తెలుగు టీవీ చానల్‌తో మాట్లాడిన ఎన్బీకే.. ఆస్కార్ అవార్డ్ విన్నర్, మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ […]

Update: 2021-07-22 03:40 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. ముక్కుసూటి వ్యక్తిత్వం గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఏ విషయాన్నైనా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం ఆయనకు అలవాటు. ఈ మేరకు కొన్నిసార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం సృష్టించగా.. తాజాగా ఏఆర్ రెహమాన్‌తో పాటు ‘భారతరత్న’పై ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. ఇటీవలే ఒక తెలుగు టీవీ చానల్‌తో మాట్లాడిన ఎన్బీకే.. ఆస్కార్ అవార్డ్ విన్నర్, మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ఎవరో తెలియదన్నాడు.

అంతేకాదు భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’.. తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కాలి గోటికి సమానమంటూ కొత్త వివాదానికి తెరలేపారు. తమ ఫ్యామిలీ తెలుగు ఇండస్ట్రీకి చేసిన సేవలకు ఏ అవార్డు కూడా సరిపోదని చెబుతూ.. రెహమాన్ ఆస్కార్ అవార్డు గెలిచి ఉండవచ్చు కానీ ఆయన గురించి సరిగ్గా తెలియదని, ఎందుకంటే పదేళ్లకు ఒక హిట్ ఇస్తాడంటూ విమర్శించారు. దీంతో నొచ్చుకున్న రెహమాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ట్రోలింగ్‌కు దిగారు. కాగా 1993లో బాలక‌ృష్ణ నటించిన ‘నిప్పురవ్వ’ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించింది రెహమానే.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..