బజాజ్ ఎలక్ట్రికల్స్ ఆదాయంలో 27 శాతం క్షీణత!
దిశ, సెంట్రల్ డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో బజాజ్ ఎలక్ట్రికల్స్ రూ.81 లక్షల నికర నష్టాలను ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.23.08 కోట్ల నికర లాభాలను నమోదు చేసినట్టు బజాజ్ ఎలక్ట్రికల్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే, చివరి త్రైమాసికంలో కార్యకలాపాల నుంచి ఏకీకృత ఆదాయం 26.73 శాతం తగ్గి రూ. 1,300.66 కోట్లని, ఇది ఇంతకుముందు రూ. 1,775.18 కోట్లని తెలిపింది. ఇక, ఈ త్రైమాసికంలో మొత్తం […]
దిశ, సెంట్రల్ డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో బజాజ్ ఎలక్ట్రికల్స్ రూ.81 లక్షల నికర నష్టాలను ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.23.08 కోట్ల నికర లాభాలను నమోదు చేసినట్టు బజాజ్ ఎలక్ట్రికల్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే, చివరి త్రైమాసికంలో కార్యకలాపాల నుంచి ఏకీకృత ఆదాయం 26.73 శాతం తగ్గి రూ. 1,300.66 కోట్లని, ఇది ఇంతకుముందు రూ. 1,775.18 కోట్లని తెలిపింది. ఇక, ఈ త్రైమాసికంలో మొత్తం ఖర్చులు ఇంతకుముందు కంటే 25.38 శాతం తగ్గి రూ. 1,318.95 కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ఇక, వినియోగదారుల ఉత్పత్తి విభాగం నుంచి కంపెనీ ఆదాయం స్వల్పంగా పెరిగి రూ. 743.28 కోట్ల నుంచి రూ. 746.76 కోట్లకు పెరిగినట్టు తెలిపింది. ఇంజనీరింగ్, సంపాదన, నిర్మాణం(ఈపీసీ) విభాగం ఆదాయం 46.32 శాతం తగ్గి రూ. 553.80 కోట్లకు చేరిందని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బజాజ్ ఎలక్ట్రికల్ నికర నష్టం రూ. 10.28 కోట్లని, అంతకుముందు ఇది రూ. 153.58 కోట్లని తెలిపింది. ఆర్థిక కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 25.33 శాతం పెరిగి రూ. 4,987.23 కోట్లకు చేరిందని కంపెనీ వెల్లడించింది. బజాజ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ బజాజ్ మాట్లాడుతూ, ‘‘తమ వినియోగదారు ఉత్పత్తుల విభాగంలో వృద్ధిని కొనసాగిస్తున్నాము. అయితే ఈపీసీ విభాగంలో కొంత ప్రతికూలత ఉందని’’ వివరించారు.
మరిన్ని త్రైమాసిక ఫలితాలు..
క్యాడిలా హెల్త్‌కేర్…
ప్రముఖ ఔషధ కంపెనీ క్యాడిలా హెల్త్‌కేర్ 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 14.82 శాతం క్షీణించి రూ. 391.9 కోట్లుగా ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 460.1 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. కంపెనీ ఆదాయం అంతకుముందు ఉన్న రూ. 3,732.8 కోట్ల నుంచి రూ. 3,752.1 కోట్లకు చేరుకుందని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం రూ. 1,848.8 కోట్ల నుంచి రూ. 1,176.6 కోట్లకు తగ్గినట్టు పేర్కొంది. కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం రూ. 13,165.6 కోట్ల నుంచి రూ. 14,253.1 కోట్లకు పెరిగిందని తెలిపింది.
నొవార్టిస్ ఇండియా..
మరో ఔషధ సంస్థ నొవార్టిస్ ఇండియా 2019-20 ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ. 6.78 కోట్లతో 65.28 శాతం క్షీణించినట్టు వెల్లడించింది. అలాగే, మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమ్మకాలు 15.11 శాతం తగ్గి రూ. 93.70 కోట్లకు చేరాయని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 80.53 శాతం క్షీణించి రూ. 10.08 కోట్లకు చేరినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 51.77 కోట్లుగా నమోదైంది. అమ్మకాలు 10.69 శాతం తగ్గి రూ. 438.25 కోట్లకు చేరినట్టు కంపెనీ ప్రకటించింది.
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్…
గృహ రుణాల సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నికర లాభం 39.24 శాతం క్షీణించి రూ. 421.43 కోట్లని ప్రకటించింది. అంతకుముందు ఇదే త్రైమాసికంలో రూ. 693.58 కోట్లుగా నమోదైంది. అమ్మకాలు 5.63 శాతం పెరిగి రూ. 4,920.17 కోట్లకు చేరుకున్నాయని, అంతకుముందు ఇది రూ. 4657.92 కోట్లని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 1.20 శాతం తగ్గి రూ. 2,401.84 కోట్లకు చేరిందని, అమ్మకాలు 13.47 శాతం పెరిగి రూ. 19,696.69 కోట్లకు చేరినట్టు కంపెనీ ప్రకటించింది. అంతకుముందు ఏడాది అమ్మకాలు రూ. 17,357.79 కోట్లని తెలిపింది.