బ్రేకింగ్ న్యూస్.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా బి.జనార్దన్ రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కొత్త చైర్మన్‌గా బి. జనార్దన్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్​ ప్రతిపాదనలపై గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ఆమోదముద్ర వేశారు. జనార్దన్ రెడ్డితో పాటు టీఎస్‌పీఎస్సీలో ఏడుగురు సభ్యులు కొత్తగా నియామకం అయ్యారు. వీరిలో మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, ఆయుర్వేద డా. చంద్రశేఖర్ రావు, రిటైర్డ్ హెల్త్ ఈఎన్‌సీ రమావత్ ధన్‌సింగ్, […]

Update: 2021-05-19 00:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కొత్త చైర్మన్‌గా బి. జనార్దన్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్​ ప్రతిపాదనలపై గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ఆమోదముద్ర వేశారు. జనార్దన్ రెడ్డితో పాటు టీఎస్‌పీఎస్సీలో ఏడుగురు సభ్యులు కొత్తగా నియామకం అయ్యారు. వీరిలో మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, ఆయుర్వేద డా. చంద్రశేఖర్ రావు, రిటైర్డ్ హెల్త్ ఈఎన్‌సీ రమావత్ ధన్‌సింగ్, సీబీఐటీ ప్రొ. లింగారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్‌లు ఉన్నారు. ప్రస్తుతం జనార్దన్ రెడ్డి వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈయన జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కూడా విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతకుముందు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ఘంటా చక్రపాణి.. సభ్యులు విఠల్‌.. చంద్రావతి.. మతినుద్దిన్‌ ఖాద్రీలు ఆరేళ్ల పాటు సేవలందించారు. వీరి పదవికాలం ముగియడంతో కొత్తవారిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News