న్యూస్ రీడర్ & లాయర్ గా పనిచేస్తున్న ఆమెకు ప్రముఖ అవార్డు
దిశ, గోదావరిఖని: గోదావరిఖనికి చెందిన హైకోర్టు జూనియర్ న్యాయవాది అశ్రీత గాంధీకి యువ ప్రతిభ రత్న పురస్కారం లభించింది. సామాజిక సేవతోపాటు న్యూస్ రీడర్ గా, న్యాయ సేవలో చూపుతున్న ప్రతిభకు గుర్తింపుగా స్వాతంత్ర్య అమృత మహోత్సవం సందర్భంగా “బెస్ట్ ఆఫ్ లక్” సామాజిక అకాడమీ “యువ ప్రతిభా రత్న”పురస్కారాన్ని హైదరాబాద్ పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వ విద్యాలయంలో డాక్టర్ నందమూరి తారక రామారావు కళా ప్రాంగణంలో అశ్రీత గాంధీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ […]
దిశ, గోదావరిఖని: గోదావరిఖనికి చెందిన హైకోర్టు జూనియర్ న్యాయవాది అశ్రీత గాంధీకి యువ ప్రతిభ రత్న పురస్కారం లభించింది. సామాజిక సేవతోపాటు న్యూస్ రీడర్ గా, న్యాయ సేవలో చూపుతున్న ప్రతిభకు గుర్తింపుగా స్వాతంత్ర్య అమృత మహోత్సవం సందర్భంగా “బెస్ట్ ఆఫ్ లక్” సామాజిక అకాడమీ “యువ ప్రతిభా రత్న”పురస్కారాన్ని హైదరాబాద్ పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వ విద్యాలయంలో డాక్టర్ నందమూరి తారక రామారావు కళా ప్రాంగణంలో అశ్రీత గాంధీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య చేతుల మీదుగా అందజేశారు. జస్టిస్ తోపాటుగా ప్రముఖ సంఖ్యా శాస్త్ర నిపుణులు దైవజ్ఞ శర్మ, కూచిపూడి నాట్య గురువు డాక్టర్ ఎస్పీ భారతి, అకాడమీ బాధ్యులు డాక్టర్ సూర్య నారాయణ మాస్టర్, సూర్య తేజ సుబ్రాంత్ లు ఉన్నారు. ఈ సందర్భంగా అశ్రీత గాంధీని ముందడుగు వారు అభినందించారు. కాగా ఈ యువ ప్రతిభ రత్న పురస్కారాన్ని అందుకున్న అశ్రీత గాంధీని గోదావరిఖని ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.