దశాబ్దం కనిష్టానికి ఆ వేతనాలు పెరిగాయి

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం మధ్య భారత్‌లోని కంపెనీలు ప్రస్తుత ఏడాదిలో సగటున 6.1 శాతం వేతనాలను పెంచాయి. ఇది ఒక దశాబ్దానికి పైగా కనిష్టం. అయితే, 2021లో దేశీయ కంపెనీలు 7.3 శాతం వేతన పెంపును ఇస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయాన్ పీఎల్‌సీ బుధవారం నిర్వహించిన సర్వేలో కొవిడ్-19 సవాళ్లు ఉన్నప్పటికీ దేశంలోని సంస్థలు మెరుగైన పనితీరును కనబరచాయి. అలాగే, రికవరీ వేగంగా ఉంటుందని తేలింది. ప్రస్తుత ఏడాదిలో […]

Update: 2020-11-04 06:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం మధ్య భారత్‌లోని కంపెనీలు ప్రస్తుత ఏడాదిలో సగటున 6.1 శాతం వేతనాలను పెంచాయి. ఇది ఒక దశాబ్దానికి పైగా కనిష్టం. అయితే, 2021లో దేశీయ కంపెనీలు 7.3 శాతం వేతన పెంపును ఇస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయాన్ పీఎల్‌సీ బుధవారం నిర్వహించిన సర్వేలో కొవిడ్-19 సవాళ్లు ఉన్నప్పటికీ దేశంలోని సంస్థలు మెరుగైన పనితీరును కనబరచాయి.

అలాగే, రికవరీ వేగంగా ఉంటుందని తేలింది. ప్రస్తుత ఏడాదిలో 71 శాతంతో పోలిస్తే 2021లో 87 శాతం కంపెనీలు జీతాల పెంపును ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సర్వే ప్రకారం..భారత్‌లోని కంపెనీలు 2020లో సగటున 6.1 శాతం వేతన పెంపు, 2009లో ఉన్న సగటు 6.3 శాతంతో సమానంగా ఉంది.

ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి వచ్చే ఏడాది జీతాల పెంపు సగటు 7.3 శాతంగా ఉండొచ్చని సర్వే అభిప్రాయపడింది. ఈ గణాంకాల సేకరణలో దేశవ్యాప్తంగా మొత్తం 1,050 కంపెనీలు పాల్గొన్నాయి. వీటిలో 87 శాతం కంపెనీలు వచ్చే ఏడాదిలో జీతాల పెంపును ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా, 61 శాతం కంపెనీలు 6 నుంచి 10 శాతం పెరుగుదలను ఇవ్వనున్నాయి. ‘ ఈ ఏడాది అన్ని రంగాలకు ప్రత్యేకంగా ఉంది. బడా వ్యాపారవేత్తలు తమ ఉద్యోగులు, వాటాదారుల కంటే ముందే పెట్టుబడులను పెడుతున్నారు.

భారత ఆర్థికవ్యవస్థపై కొవిడ్-19 మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, కంపెనీలు మెరుగైన పనితీరునే చూపిస్తున్నాయి. ఇది భవిష్యత్తు ఆర్థికవ్యవస్థపై సానుకూల సంకేతాలను ఇవ్వగలుగుతుందని అయాన్ పీఎల్‌సీ భాగస్వామి, రివార్డ్స్ సొల్యూషన్స్ ప్రాక్టీస్ సీఈవో నితిన్ సేథి చెప్పారు. 2020లో ఇచ్చే ఇంక్రిమెంట్లతో పోలిస్తే 2021లో మూడింట రెండు వంతుల కంపెనీలు ఎక్కువ ఇంక్రిమెంట్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని అయాన్ డైరెక్టర్ నవనీత్ రతన్ అన్నారు.

Tags:    

Similar News