‘ఆ మూడింటితో వైజాగ్ అభివృద్ధి’
దిశ ఏపీ బ్యూరో: ఎయిర్ పోర్ట్, మూడు పోర్టులు, రైల్వే జోన్ తో వైజాగ్ ని అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. వైజాగ్ లోని మధురవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచస్థాయిలో విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖ నగరానికి అన్ని హంగులు సమకూర్చబోతున్నామని చెప్పారు. అందులో భాగంగానే 4.5 కోట్ల అభివృద్ది పనులకి శంఖుస్థాపనల చేశామన్నారు. పూర్తి స్ధాయి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామని […]
దిశ ఏపీ బ్యూరో: ఎయిర్ పోర్ట్, మూడు పోర్టులు, రైల్వే జోన్ తో వైజాగ్ ని అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. వైజాగ్ లోని మధురవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచస్థాయిలో విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖ నగరానికి అన్ని హంగులు సమకూర్చబోతున్నామని చెప్పారు. అందులో భాగంగానే 4.5 కోట్ల అభివృద్ది పనులకి శంఖుస్థాపనల చేశామన్నారు. పూర్తి స్ధాయి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామని చెప్పారు.
గత ఏడాది విశాఖలో 1000 కోట్ల రూపాయలుపైగా అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే 17 కోట్లతో అభివృద్ది పనులు చేపడుతున్నామని చెప్పారు. విశాఖ నగరంలో మౌలిక వసతులపై దృష్టి పెట్టామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చెందడానికి విశాఖ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో వైజాగ్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయని అంచనా వేశారు. విశాఖ 2019 కి ముందు…ఆ తర్వాత అన్న తేడాలను ప్రజలు స్పష్టంగా గుర్తిస్తారని ఆయన చెప్పారు.. ఎయిర్ పోర్టు, మూడు పోర్టులు, రైల్వే డివిజన్ ఇలా వైజాగ్ అన్ని వసతులు కలిగిన నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.