బాల్య వివాహం అడ్డుకున్న అధికారులు
దిశ, బెల్లంపల్లి: బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారంతో జిల్లా అధికారులు సోమవారం తాండూర్ మండలం రేచిని గ్రామాన్ని సందర్శించి అడ్డుకున్నారు. అనంతరం గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు బాల్య వివాహాల మూలంగా జరిగే అనర్థాల గురించి వివరించారు. ఎవరైనా అమ్మాయికి 18 ఏండ్లు, అబ్బాయికి 21 ఏండ్లు నిండిన తర్వాతనే వివాహాలు జరుపాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమించి ఎవరైనా బాల్య వివాహాలు జరిపితే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.