టీ20 వరల్డ్ కప్: శ్రీలంకపై ఆస్ట్రేలియా గెలుపు.. వార్నర్ ఆన్ ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: టీ 20 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపు నమోదు చేసుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఇక 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు 17 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియాలో ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో 10 […]

Update: 2021-10-28 11:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీ 20 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపు నమోదు చేసుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఇక 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు 17 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది.

ఆస్ట్రేలియాలో ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో 10 ఫోర్లు కొట్టి 65 పరుగులు నమోదు చేశాడు. ఇతడికి తోడు ఆరోన్ ఫించ్ 23 బంతుల్లో 37 పరుగులతో తన వంతు కృషి చేశాడు. ఆ తర్వాత వచ్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ (5) నిరాశ పరిచాడు. ఇక మిడిలార్డర్‌ బ్యాట్స్‌మాన్‌లు స్టీ్వ్ స్మిత్ (28 నాటౌట్), స్టోయినిస్ 16 (నాటౌట్)‌గా నిలిచి జట్టును గెలిపించుకున్నారు.

Tags:    

Similar News