చైనా విషయంలో అమెరికాకు ఆస్ట్రేలియా మద్దతు

వాషింగ్టన్: కొంత కాలంగా చైనా, డబ్ల్యూహెచ్‌ఓ తీరుపై అమెరికా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ప్రస్తుత ప్రపంచ సంక్షోభానికి ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు చైనా కూడా కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అంతర్జాతీయ దర్యాప్తు చేయాలని.. ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రతిపాదనకు మద్దతు పలకాలని ఆయన కోరారు. కాగా, ఆస్ట్రేలియా ఈ ప్రతిపాదనపై స్పందించింది. కరోనా సంక్షోభానికి కారణమైన దేశాలు, డబ్ల్యూహెచ్‌ఓపై స్వతంత్ర దర్యాప్తు జరపాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. ఈ సమయంలో డబ్ల్యూహెచ్‌ఓతో పాటు […]

Update: 2020-04-19 10:07 GMT

వాషింగ్టన్: కొంత కాలంగా చైనా, డబ్ల్యూహెచ్‌ఓ తీరుపై అమెరికా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ప్రస్తుత ప్రపంచ సంక్షోభానికి ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు చైనా కూడా కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అంతర్జాతీయ దర్యాప్తు చేయాలని.. ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రతిపాదనకు మద్దతు పలకాలని ఆయన కోరారు. కాగా, ఆస్ట్రేలియా ఈ ప్రతిపాదనపై స్పందించింది. కరోనా సంక్షోభానికి కారణమైన దేశాలు, డబ్ల్యూహెచ్‌ఓపై స్వతంత్ర దర్యాప్తు జరపాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. ఈ సమయంలో డబ్ల్యూహెచ్‌ఓతో పాటు వివిధ దేశాలు వ్యవహరించిన తీరుపై సమీక్ష అవసరమని ఆస్ట్రేలియా అంటోంది. కరోనాను ఎదుర్కునే సమయంలో చైనాపై వచ్చిన ఆరోపణలను తాము సమర్థిస్తున్నామని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్ పేన్ స్పష్టం చేశారు. వైరస్ విజృంభిస్తున్న సమయంలో దాని పుట్టుక, ఎదుర్కోవడంలో అనుసరించిన వ్యూహాలు, చికిత్సా విధానం తదితర అంశాలను ఇతర దేశాలతో పంచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాని చైనా ఇవేమీ పట్టించుకోకుండా అనేక విషయాలు దాచిపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిని నిర్ధారించుకోవాలంటే స్వతంత్ర దర్యాప్తే ఏకైక దారి. కాబట్టి అమెరికా డిమాండును మేం కూడా బలపరుస్తున్నామని మారిస్ స్పష్టం చేశారు. చైనాలో వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలో ఆ దేశం నుంచి ఆస్ట్రేలియాకు వచ్చే విమానాల రాకపోకలను నిషేధించాం. కాని ప్రపంచ ఆరోగ్య సంస్థ మా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరింది. కాని మేం మా నిర్ణయానికే కట్టుబడి ఉండటం వల్ల.. ఆస్ట్రేలియాలో వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టగలిగామని ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంత్ చెప్పారు. మలేరియా, పోలియో విషయంలో ఎంతో నిబద్దతతో పనిచేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా విషయంలో ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన ప్రవ్నించారు. ఏ దేశానికి ఆ దేశం సొంతగా నిర్ణయాలు తీసుకొని వైరస్‌ను కట్టడి చేసినందు వల్లే ఈ మాత్రమైన తీవ్రతను తగ్గించగలిగారని ఆయన అన్నారు.

TAGS: coronavirus, WHO, US, australia, allegations, china, wrong

Tags:    

Similar News