ఒలింపిక్స్ నుంచి ఆస్ట్రేలియా ఔట్ !

కరోనా ప్రభావం కారణంగా టోక్యో ఒలింపిక్స్ 2020ని బహిష్కరిస్తున్నట్లు ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు మ్యాట్ కారల్ ప్రకటించారు. ఇప్పటికే ఒలింపిక్స్‌లో పాల్గొనబోమని కెనడా తేల్చి చెప్పింది. ఇక అమెరికా సైతం ఒలింపిక్స్‌ను వాయిదా వేయమని పట్టుబడుతోంది. కాగా, ఒలింపిక్స్‌ను ఎట్టి ప్రసక్తిలోనూ వాయిదా వేయాలనుకోవడం లేదని, అసరమైతే నాలుగు వారాల తర్వాత వాయిదా విషయం ఆలోచిస్తామని ఐఓసీ ఇప్పటికే చెప్పింది. దీంతో పలు దేశాలు బహిష్కరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. కరోనా మహమ్మారిని కళ్లారా చూస్తూ […]

Update: 2020-03-24 04:16 GMT

కరోనా ప్రభావం కారణంగా టోక్యో ఒలింపిక్స్ 2020ని బహిష్కరిస్తున్నట్లు ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు మ్యాట్ కారల్ ప్రకటించారు. ఇప్పటికే ఒలింపిక్స్‌లో పాల్గొనబోమని కెనడా తేల్చి చెప్పింది. ఇక అమెరికా సైతం ఒలింపిక్స్‌ను వాయిదా వేయమని పట్టుబడుతోంది. కాగా, ఒలింపిక్స్‌ను ఎట్టి ప్రసక్తిలోనూ వాయిదా వేయాలనుకోవడం లేదని, అసరమైతే నాలుగు వారాల తర్వాత వాయిదా విషయం ఆలోచిస్తామని ఐఓసీ ఇప్పటికే చెప్పింది. దీంతో పలు దేశాలు బహిష్కరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. కరోనా మహమ్మారిని కళ్లారా చూస్తూ తమ అథ్లెట్లను టోక్యో పంపలేమని.. ఇందుకు ఐవోసి నిర్ణయం కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా లేదనిపించే బహిష్కరించాలని అనుకుంటున్నట్లు ఆస్ట్రేలియా వెల్లడించింది.

Tags: Olympics, Corona effect, Tokyo, IOC, Australia

Tags:    

Similar News