ఆగస్ట్5న అయోధ్యలో భూమిపూజ
దిశ, వెబ్ డెస్క్: అయోధ్య రామమందిర నిర్మాణ భూమి పూజకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఆగస్ట్ 5న ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ హాజరవుతున్నట్లు సమాచారం. అలాగే మరో 50పైగా వీఐపీలు అయోధ్య రానున్నారు. అయితే రామమందిర నిర్మాణ భూమి పూజ కోవిడ్ నిబంధనలకు లోబడే నిర్వహించేందుకు యూపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. అయోధ్య నగర వ్యాప్తంగా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి భూమి పూజను భక్తులు వీక్షించేలా […]
దిశ, వెబ్ డెస్క్: అయోధ్య రామమందిర నిర్మాణ భూమి పూజకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఆగస్ట్ 5న ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ హాజరవుతున్నట్లు సమాచారం. అలాగే మరో 50పైగా వీఐపీలు అయోధ్య రానున్నారు. అయితే రామమందిర నిర్మాణ భూమి పూజ కోవిడ్ నిబంధనలకు లోబడే నిర్వహించేందుకు యూపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. అయోధ్య నగర వ్యాప్తంగా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి భూమి పూజను భక్తులు వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గర్భగుడిలో దేవుడిని ప్రతిష్ఠించే ప్రాంతంలో ఇటుకను ఉంచబోతున్నట్టు తెలిపారు. ప్రధాన కార్యక్రమానికి మూడు రోజుల ముందు నుంచి వేద శాస్త్రాలను అనుసరించి క్రతువులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించామని తెలిపారు.
అయోధ్య ఉద్యమంతో సంబంధం ఉన్న సీనియర్ బీజేపీ నేతలందరినీ ఆహ్వానించామని ట్రస్ట్ తెలిపింది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కతియార్, సాధ్వి రీతంభర తదితరులంతా ఈ జాబితాలో ఉన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపింది.