హుజురాబాద్ సీఐ మాధవిపై కేసు
దిశ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వి. మాధవిపై కులం పేరుతో దూషించిన కేసు నమోదు అయింది. ఆమె పని చేస్తున్న పోలీస్ స్టేషన్ లోనే ఆమెపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాల్లోకి వెలితే… కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ కు చెందిన రమేష్ లక్ష్మణ్ రుద్రారపు అనే వ్యక్తి క్రైం నెంబర్ 102/2020 లో సీజ్ అయిన తన […]
దిశ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వి. మాధవిపై కులం పేరుతో దూషించిన కేసు నమోదు అయింది. ఆమె పని చేస్తున్న పోలీస్ స్టేషన్ లోనే ఆమెపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాల్లోకి వెలితే… కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ కు చెందిన రమేష్ లక్ష్మణ్ రుద్రారపు అనే వ్యక్తి క్రైం నెంబర్ 102/2020 లో సీజ్ అయిన తన వాహనాన్ని విడుదల చేయాలని కోరాడు.
సీఐ మాధవి ఛాంబర్‌కు వెల్లి అడిగినప్పుడు తనను కులం పేరుతో దూషించిందని బాధితుడు రమేష్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఐపీసీ 504, 506, 3(1) (r) (s) ఎస్సీ, ఎస్టీ పీఓఏ యాక్టు కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 2వ తేదిన ఎఫ్ఐఆర్ జారీ అయినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.