హైదరాబాద్‌లో మరో దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం..
దిశ, ముషీరాబాద్: ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటన పార్శిగుట్టలో తీవ్ర కలకలం రేపింది. సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈస్ట్ మున్సిపల్ కాలనీలో నివాసం ఉంటున్న ఏడేళ్ల చిన్నారి ఆదివారం సాయంత్రం ఆడుకుంటోంది. ఆ సమయంలో కాలనీలోని ఫుట్ పాత్ పై తాగి ఉన్న వ్యక్తి ఆడుకుంటున్న చిన్నారిని […]
దిశ, ముషీరాబాద్: ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటన పార్శిగుట్టలో తీవ్ర కలకలం రేపింది. సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈస్ట్ మున్సిపల్ కాలనీలో నివాసం ఉంటున్న ఏడేళ్ల చిన్నారి ఆదివారం సాయంత్రం ఆడుకుంటోంది. ఆ సమయంలో కాలనీలోని ఫుట్ పాత్ పై తాగి ఉన్న వ్యక్తి ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ కొనిస్తాని దగ్గరకు పిలిచి, షాపుకు వెళ్దామని వెంట పెట్టుకొని బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత రోడ్టు ప్రక్కన నిలిపి ఉన్న ప్యాసింజర్ ఆటో వెనక్కి తీసుకెళ్లిన కామాంధుడు దుస్తులు విప్పి పాపపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీంతో చిన్నారి ఒక్కసారిగా ఏడ్చింది. పాప ఏడ్పు చప్పుడు విన్న ఓ మహిళ ఇంట్లోంచి బయటకు వచ్చి జరుగుతున్న దారుణాన్ని చూసి స్థానికులకు సమాచారం అందించింది.
విషయం తెలుసుకున్న కాలనీ వాసులంతా అక్కడికి చేరుకొని కామాంధుడికి దేహశుద్ధి చేసి ముషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘలనా స్థలానికి చేరుకున్న ముషీరాబాద్ డీఐ వెంకన్న, ఎస్సై సురేందర్ లు నిందితుడు మల్లికార్జున్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి చిత్తు కాగితాలు ఏరుకుంటూ ఫుట్ పాత్ పై జీవనం సాగించే మురళి, అలియాస్ మల్లికార్జున్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మద్యం తాగిన వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడటంతో అందుకు దగ్గరలో ఉన్న మద్యం షాపు కారణమని అది మూసి వేయాలంటూ స్థానికులు ఒక్కసారిగా గొడవకు దిగారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని స్థానికులకు సర్థిచెప్పి గొడవ సద్దుమనిగేలా చేశారు.