‘కన్హయ్య కుమార్’ కాన్వాయ్‌పై దాడి
జెఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు మద్దతు తెలిపేందుకు బక్సర్ నుంచి బీహార్ మీదుగా అర్రా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా గత రెండు వారాల్లో కన్హయ్య కుమార్‌పై దాడి జరగటం ఇది ఎనిమిదోసారి. తన మద్దతుదారులు, పోలీస్ ఎస్కార్ట్‌తో కలిసి ఐదు వాహనాల్లో కన్హయ్య ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అర్రా పట్టణానికి వెళ్లే జాతీయ రహదారిపై […]
జెఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు మద్దతు తెలిపేందుకు బక్సర్ నుంచి బీహార్ మీదుగా అర్రా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా గత రెండు వారాల్లో కన్హయ్య కుమార్‌పై దాడి జరగటం ఇది ఎనిమిదోసారి. తన మద్దతుదారులు, పోలీస్ ఎస్కార్ట్‌తో కలిసి ఐదు వాహనాల్లో కన్హయ్య ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అర్రా పట్టణానికి వెళ్లే జాతీయ రహదారిపై చేతిలో రాళ్లు, ముఖానికి మాస్క్‌లతో ఒక గ్రూపు తమ కాన్వాయ్‌కు ఎదురుపడినట్టు కన్హయ్య కుమార్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మనీష్ కుమార్ దాడి వివరాలను వెల్లడించారు. కన్హయ్య కుమార్ కారు దిగి అక్కడ పోగైన జనంతో మాట్లాడుతుండగానే.. ఎదుటివర్గం చెలరేగి కాన్వాయ్‌పై పది నిమిషాల పాటు రాళ్ల వర్షం కురిపించారని ఆయన తెలిపారు.