అర్నబ్ గోస్వామిపై అర్ధరాత్రి దాడి

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై అర్థరాత్రి దాడి జరిగింది. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ముంబైలోని చానెల్ స్టూడియో నుంచి తన భార్యతో కలసి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు యువకులు దాడికి యత్నించారని.. వారు కాంగ్రెస్ పార్టీ యూత్ కార్యకర్తలేనని అర్నబ్ ఆరోపించారు. ఇటీవల ఆయన ఎడిటర్స్ గిల్డ్ కు రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించి సంచలనం స‌ృష్టించారు. ‘‘ రాత్రి 21 గంటల సమయంలో కారులో ఇంటి బయలుదేరాం. […]

Update: 2020-04-22 22:38 GMT

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై అర్థరాత్రి దాడి జరిగింది. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ముంబైలోని చానెల్ స్టూడియో నుంచి తన భార్యతో కలసి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు యువకులు దాడికి యత్నించారని.. వారు కాంగ్రెస్ పార్టీ యూత్ కార్యకర్తలేనని అర్నబ్ ఆరోపించారు. ఇటీవల ఆయన ఎడిటర్స్ గిల్డ్ కు రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించి సంచలనం స‌ృష్టించారు.
‘‘ రాత్రి 21 గంటల సమయంలో కారులో ఇంటి బయలుదేరాం. ఇంతలోనే రెండు బైక్ లు మా కారును వెంబడించాయి. ఆపై టేక్ ఓవర్ చేసి రోడ్డుకు అడ్డంగా ఆపారు. అక్కడి నుంచి తప్పించుకొని పోతుంటే కారు అద్దాలు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. ఆపై ద్రావణం ఉన్న సీసాలను మా కారుపై విసిరేశారు. దీంతో కారును వేగంగా పోనిచ్చాను. వెనుక వస్తున్న సెక్యూరిటీ సిబ్బంది వారిని పట్టుకున్నారు.’’ అంటూ అర్నబ్ గోస్వామి వీడియోలో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులుకు ఫిర్యాదు చేశానన్నారు. తనపై దాడికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags: Arnab Goswami, republic tv editor, attack, mumbai

Tags:    

Similar News