దారుణం.. అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి యువ జంటపై దాడి..
దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కొత్త జంటపై ఆగంతకులు దాడి చేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ మండలం నుంచి కౌటాల వైపు సోమవారం రాత్రి బైక్‌పై కొత్త జంట అంజన్న, మౌనిక భార్య భర్తలు వెళ్తున్నారు. ఈ క్రమంలో కదంబ అటవీ ప్రాంతంలో మూత్ర విసర్జన కోసం మౌనిక వెళ్లగా అంజన్న బైక్ దగ్గర ఉన్నాడు. ఈ నేపథ్యంలో అంజన్న, మౌనికలపై […]
దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కొత్త జంటపై ఆగంతకులు దాడి చేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ మండలం నుంచి కౌటాల వైపు సోమవారం రాత్రి బైక్‌పై కొత్త జంట అంజన్న, మౌనిక భార్య భర్తలు వెళ్తున్నారు. ఈ క్రమంలో కదంబ అటవీ ప్రాంతంలో మూత్ర విసర్జన కోసం మౌనిక వెళ్లగా అంజన్న బైక్ దగ్గర ఉన్నాడు.
ఈ నేపథ్యంలో అంజన్న, మౌనికలపై ఆగంతకులు దాడి చేశారు. దీంతో రోడ్డు పక్కనే అపస్మారక స్థితిలో ఉన్న అంజన్న, మౌనికను వాహనదారులు గుర్తించి కాగజ్ నగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో మౌనిక తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంజన్న స్వల్పంగా గాయపడ్డాడు. అయితే వీరిపై ఎవరు దాడి చేశారు అనే విషయంపై చింతల మనేపల్లి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బంగారు ఆభరణాల కోసమే ఈ దాడి చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.